IND Vs AUS: టీమిండియాకి అగ్ని పరీక్ష?

Purushottham Vinay
ఇక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అహ్మదాబాద్ వేదికగా మార్చి 9వ తేదీ నుంచి ఆస్ట్రేలియా, ఇండియా మధ్య నాలుగో టెస్ట్ అనేది జరగనుంది. ఇంకా అలాగే స్వదేశం నుంచి ప్యాట్ కమిన్స్ తిరిగి ఇండియాకు రాకపోవడంతో నాలుగో టెస్టులో కూడా స్టీవ్ స్మిత్ ఆసీస్ టీం కెప్టెన్సిని చేపట్టనున్నాడు.ఇక తన కెప్టెన్సీతో మూడో టెస్టులో జట్టుకు చాలా అద్భుత విజయాన్ని అందించడమే కాకుండా.. డబ్ల్యూటీసీ ఫైనల్స్ బెర్త్‌ను కూడా స్టీవ్ స్మిత్ కన్ఫర్మ్ చేసిన సంగతి తెలిసిందే. అదే స్పీడుతో చివరి టెస్టులో కూడా విజయం సాధించి.. సిరీస్ సమం చేయాలని ప్రణాళికలని రెడీ చేస్తున్నాడు. ఇక మూడో టెస్టులో స్మిత్ బౌలర్లను ఉపయోగించిన తీరు.. ఫీల్డింగ్ టెక్నిక్స్‌పై అటు ఆసీస్ మాజీలు ఇంకా అలాగే ఇటు టీమిండియా దిగ్గజ క్రికెటర్లు కూడా ప్రశంసల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే.ఇక ఇదిలా ఉండగా టీమిండియా జట్టులోని నెగటివ్‌లు అధిగమించి ఈ నాలుగో టెస్టులో అద్భుత విజయాన్ని సాధించాలని ఉవ్విళ్లూరుతోంది.


ఒకవేళ అదే కనుక జరిగితే డబ్ల్యూటీసీ ఫైనల్స్‌ బెర్త్‌ను ఇండియా ఫైనల్ చేసుకున్నట్లే. బ్యాటింగ్‌లో చిన్న చిన్న లోపాలు తప్పా .. టీమిండియాలో ప్లేయింగ్ టీం చాలా స్ట్రాంగ్ అని చెప్పొచ్చు. రెండేళ్ల క్రిందట అహ్మదాబాద్‌లో ఇంగ్లాండ్‌ను కేవలం మూడు రోజుల్లోనే టీమిండియా చిత్తు చేసిన సంగతి తెలిసిందే.ఇక అప్పుడు అశ్విన్ ఇంకా అక్షర్ పటేల్ తన స్పిన్ మాయాజాలంతో ఇంగ్లీష్ బ్యాటర్లను ఎంతగానో ముప్పుతిప్పలు పెట్టారు. ఇక ఇప్పుడు కూడా అదే సీన్ రిపీట్ చేయాలని చూస్తోంది రోహిత్ ఆర్మీ.ఇక ఆసీస్‌తో టెస్ట్ సిరీస్ 2-2తో డ్రా, లేదా 2-1తో కనుక గెలిస్తే.. న్యూజిలాండ్-శ్రీలంక సిరీస్ ఫలితంపై ఇండియా డబ్ల్యూటీసీ ఫైనల్స్ బెర్త్ ఆధారపడాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ సిరీస్‌ను కనుక కివీస్ టీం క్లీన్ స్వీప్ చేసుకుంటే.. లంక జట్టుతో ఆస్ట్రేలియా జట్టు ఢీకొంటుంది. అయితే అది కాకుండా శ్రీలంక ఒక్క మ్యాచ్‌లో ఓడిపోయినా కూడా టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్స్‌కు చేరుతుంది. ఇక ఇప్పటికే ఆస్ట్రేలియా మొదటి జట్టుగా డబ్ల్యూటీసీ ఫైనల్స్ చేరిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: