లక్నో కొత్త జెర్సీ లాంచ్.. ఎలా ఉందో చూడండి?

praveen
ప్రస్తుతం ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఇందులో భాగంగా అందరూ మహిళా ప్లేయర్లు  కూడా హోరాహోరీగా క్రికెట్ ఆడుతూ ప్రేక్షకులకు అసలు సిసలైన మజాను పంచుతూ ఉన్నారు. అయితే ఇక ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ముగిసిన వెంటనే అటు ప్రేక్షకులు అందరూ కూడా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం కాబోతుంది అని చెప్పాలి. మార్చ్ 31వ తేదీ నుంచి కూడా ఐపీఎల్ 2023 సీజన్ కు సంబంధించిన మ్యాచులు ప్రారంభం కాబోతున్నాయి అని చెప్పాలి.

 ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించి బీసీసీఐ పూర్తి షెడ్యూల్ ని కూడా విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఎప్పుడు ఎవరిని ఎదుర్కోబోతున్నాం అనేదానిపై అందరికీ క్లారిటీ వచ్చేసింది. ఈ క్రమంలోనే పదునైన వ్యూహాలను సిద్ధం చేసుకునే పనిలో అన్ని జట్లు కూడా సిద్ధమవుతున్నాయ్. అయితే ప్రతి ఐపీఎల్ సీజన్లో కూడా కొత్త ఉత్సాహంతో బరిలోకి దిగే అన్ని జట్లు కూడా ఇక జట్టు జెర్సీ విషయంలో కొన్ని మార్పులు చేర్పులు చేయడం కూడా చూస్తూ ఉంటామ్. ఈ క్రమంలోనే గత ఏడాది ఐపీఎల్లోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ కూడా 2023 ఏడాదిలో కొత్త జెర్సీతో బరిలోకి దిగేందుకు సిద్ధమైంది అన్నది తెలుస్తుంది.

 ఈ క్రమంలోనే 2023 ఐపీఎల్ సీజన్ కోసం లక్నో సూపర్ జెయింట్స్ జట్టు తమ టీం కొత్త జెర్సీని ఇటీవల అధికారికంగా లాంచ్ చేసింది. ఈ కొత్త జెర్సీ ని లక్నో ఫ్రాంచైజీ ఓనర్ సంజీవ్ గోయంక ఆవిష్కరించారు. ఇక ఈ జెర్సీ లాంచ్ కార్యక్రమంలో బిసిసిఐ కార్యదర్శి జైషా, లక్నో జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్, మెంటార్గా వ్యవహరిస్తున్న గౌతమ్ గంభీర్ కూడా పాల్గొన్నారు. ఇక ఈసారి లక్నో జట్టు ప్లేయర్స్ ముదురు నీలం రంగు జెర్సీలు వేసుకొని గ్రౌండ్లో అడుగు పెట్టబోతున్నారు అన్నది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: