WPL 2023: అభిమానులకు సూపర్ ఛాన్స్ ?

Purushottham Vinay
ఇక WPL 2023లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా తొలిసారిగా నిర్వహించబడుతున్న దృష్ట్యా ప్రత్యేక నిర్ణయంని తీసుకోవడం జరిగింది. అంతర్జాతీయ మహిళా దినోత్సం నాడు అంటే రేపు మార్చి 8, 2023న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ గుజరాత్ జెయింట్స్ మధ్య జరిగే మ్యాచ్ టిక్కెట్లు ఉచితంగా అందించేందుకు బీసీసీఐ రెడీ అయ్యింది.మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు పేర్కొన్నారు.మహిళల ప్రీమియర్ లీగ్‌లో ఇప్పటికే మహిళలకు టిక్కెట్లు ఫ్రీగా అందిస్తున్నారు. అన్ని వయసుల మహిళలకు ఉచితంగా మ్యాచ్‌లను చూసేందుకు అనుమతించడం జరిగింది. కేవలం పురుష ప్రేక్షకులు మాత్రమే రూ. 100 నుంచి రూ. 400ల వరకు టిక్కెట్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అయితే అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున స్త్రీ ఇంకా పురుషులిద్దరికీ టిక్కెట్లు ఫ్రీగా అందిస్తున్నారు.ఈ WPL 2023 నాల్గవ మ్యాచ్‌లో, ముంబై ఇండియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఏకంగా 9 వికెట్ల తేడాతో సులభంగా ఓడించి రెండవ విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. 


మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కేవలం 18.4 ఓవర్లలో అన్ని వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. అందుకు ముంబై ఇండియన్స్ కేవలం 14.2 ఓవర్లలో 159/1 స్కోరు చేసి ఘన విజయం సాధించింది. దీంతో టోర్నీలో ఆర్‌సీబీ వరుసగా రెండో సారి తన భారీ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఇంకా అలాగే మరోవైపు, గుజరాత్ జెయింట్స్ గురించి మాట్లాడితే.. వరుసగా రెండు మ్యాచ్‌లలో ఓడిపోవడం జరిగింది.ముంబై ఇండియన్స్ ఇప్పుడు పాయింట్ల పట్టికలో 4 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది.ఢిల్లీ క్యాపిటల్స్  2 పాయింట్లతో ముంబై తర్వాత రెండో స్థానంలో ఉంది. ఇంకా యూపీ వారియర్స్ 2 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతోంది.ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్  ఒక్క మ్యాచు కూడా గెలవకపోవడంతో చివరి స్థానాల్లో ఉన్నాయి.అయితే గుజరాత్ టైటాన్స్ రన్ రేట్ కంటే ఆర్సీబీ రన్ రేట్ కాస్త ఎక్కువ ఉంది. దీంతో ఆర్సీబీ 4వ స్థానంలో, గుజరాత్ టైటాన్స్ చిట్టచివరి (5వ స్థానంలో) స్థానంలో కొనసాగుతూ ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

WPL

సంబంధిత వార్తలు: