కోహ్లీ పేలవమైన ఫామ్.. రికీ పాంటింగ్ ఏమన్నాడో తెలుసా?

praveen
విరాట్ కోహ్లీ.. ప్రపంచ క్రికెట్లో ఎంత అత్యుత్తమమైన ఆటగాడు అన్న విషయం గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటివరకు అతను సాధించిన రికార్డులే ఈ విషయాన్ని మారుమోగిపోయేలా చెబుతూ ఉంటాయి అని చెప్పాలి. అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టిన తక్కువ సమయంలోనే తన ఆట తీరుతో అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకున్నాడు. ఇక క్రమక్రమంగా రికార్డుల వేట ప్రారంభించి ఇక ఇప్పుడు లెజెండ్ గా మారిపోయాడు అని చెప్పాలి. ఇక రికార్డుల విషయంలో కోహ్లీ ఎవరికి అందనంత దూరంలో ఉన్నాడు అని చెప్పాలి.

 ఇక సోషల్ మీడియాలో కోహ్లీకి ఉన్న పాపులారిటీ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాంటి విరాట్ కోహ్లీ దాదాపు మూడేళ్లపాటు ఫామ్ లేమీతో ఇబ్బంది పడ్డాడు. ఫార్మాట్ తో సంబంధం లేకుండా వరుస వైఫల్యాలతో విమర్శలు ఎదుర్కొన్నాడు. అతన్ని జట్టు నుంచి పీకి పారేయాలి అంటూ కొంతమంది ఘాటు విమర్శలు చేయడం కూడా చూసాం. ఇలాంటి గడ్డు పరిస్థితుల నుంచి బయటపడిన విరాట్ కోహ్లీ వన్డే టీ20 ఫార్మట్ లో సెంచరీలు చేసి అదరగొట్టాడు. ఇక కొన్ని అరుదైన రికార్డులను కూడా ఖాతాలో వేసుకున్నాడు.

 అంతా బాగానే ఉంది. కానీ వన్డే టి20 ఫార్మట్ లలో శతక్కొట్టుడు కొట్టిన విరాట్ కోహ్లీ అటు టెస్ట్ ఫార్మాట్లో మాత్రం తన వైఫల్యాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. ఆస్ట్రేలియా తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయడం లేదు అని చెప్పాలి. అతని ఆట తీరూపై విమర్శలు కూడా వస్తున్నాయ్. ఈ క్రమంలోనే కోహ్లీకి మద్దతుగా నిలిచాడు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్. విరాట్ కోహ్లీ త్వరలోనే అత్యుత్తమ ఆట తీరు కనబరిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. పరుగుల కరువులో ఉన్న కోహ్లీ తిరిగి పుడుచుకుంటాడు అనే నమ్మకం ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. ఇండియా వేదికగా జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ బ్యాట్స్మెన్ లకు పీడ కల లాంటిది అంటూ వ్యాఖ్యానించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: