ఆల్ టైం గ్రేటెస్ట్ ప్లేయర్ కోహ్లీ కాదు.. అతనే : ఏబిడి

praveen
ప్రపంచ క్రికెట్లో ఉన్న అత్యుత్తమ ఆటగాళ్లలో దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు ఏబి డివిలియర్స్ మొదటి వరుసలో ఉంటాడు అని చెప్పాలి. తన అద్భుతమైన ఆట తీరుతో తన కెప్టెన్సీ నైపుణ్యాలతో కూడా దక్షిణాఫ్రికా జట్టును ఎప్పుడూ అగ్రస్థానంలో నిలిపేందుకు ప్రయత్నించాడు. ఇకపోతే తన అరుదైన షాట్లతో మిస్టర్ 360 ప్లేయర్ గా ప్రపంచ క్రికెట్లో ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక ఐపీఎల్ లో సైతం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తరఫున ఎన్నో విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడి కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నాడు అని చెప్పాలి.

 ఇకపోతే ఏబీడీ  అటు విరాట్ కోహ్లీకి ఎంతో మంచి మిత్రుడు. వీరి మధ్య ఎంత మంచి స్నేహబంధం ఉంది అన్నది ఇప్పటికే అందరూ క్రికెట్ ప్రేక్షకులు చూసే ఉంటారు. ఏబి డివిలియర్స్ లాంటి ఆటగాడిని టి20 ఫార్మాట్లో ఆల్ టైం గ్రేటెస్ట్ ప్లేయర్ ఎవరు అని అడిగితే విరాట్ కోహ్లీ పేరు చెబుతాడు అని అందరూ భావిస్తూ ఉంటారు. కానీ కోహ్లీ స్నేహితుడు ఎబి డివిలియర్స్ మాత్రం కోహ్లీ, క్రిస్ గేల్ లాంటి స్టార్ ప్లేయర్లను పక్కనపెట్టి కొత్త ఆటగాడి పేరును తెరమీదకి తీసుకోవచ్చాడు. తన దృష్టిలో ఆల్ టైం గ్రేటెస్ట్ టి20 ప్లేయర్ ఎవరు అన్న విషయాన్ని ఇటీవలే చెప్పి అభిమానులందరికీ కూడా షాక్ ఇచ్చాడు.

 ఆఫ్ఘనిస్తాన్ స్టార్ స్పిన్నర్ అయిన రషీద్ ఖాన్ ఆల్ టైం గ్రేటెస్ట్ టీ20 ప్లేయర్ అంటూ ఏబీ డివిలియర్స్ చెప్పాడు. రషీద్ ఖాన్ బ్యాటింగ్ బౌలింగ్ చేయగలడు. రెండు విభాగాల్లోనూ అతను మ్యాచ్ విన్నర్గా నిలుస్తాడు. మైదానంలో రషీద్ ఖాన్ శక్తివంతమైన ఆటగాడు. సింహం లాంటి గుండెను కలిగి ఉన్నాడు. ఎప్పుడూ జట్టును గెలిపించాలని పోరాడుతూ ఉంటాడు. అతను అత్యుత్తమ టి20 ఆటగాలలో ఒకడు కాదు.. ఆల్ టైం గ్రేటెస్ట్ ప్లేయర్ అంటూ డివిలియర్స్ ప్రశంసలు కురిపించాడు. ఎబిడి స్నేహితుడు కోహ్లీ.. దక్షిణాఫ్రికా దిగ్గజ ప్లేయర్ గేల్ పేరు కాకుండా రషీద్ ఖాన్ పేరు చెప్పడంతో అందరూ షాక్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Abd

సంబంధిత వార్తలు: