ఇండోర్ పిచ్.. భారత బ్యాట్స్మెన్లతో ఫుట్బాల్ ఆడేసింది : సునీల్ గవాస్కర్

praveen
ప్రస్తుతం భారత క్రికెట్ ప్రేక్షకులందరూ కూడా ఆస్ట్రేలియా టీమిండియా మధ్య జరిగిన మూడో టెస్ట్ గురించి మాట్లాడుకుంటున్నారు అని చెప్పాలి. ఎందుకంటే టీమిండియా మూడో టెస్ట్ మ్యాచ్ లో ఓడిపోవడాన్ని అసలు జీర్ణించుకోలేకపోతున్నారూ అభిమానులు.  అప్పటికే రెండు టెస్ట్ మ్యాచ్ లలో గెలిచి జోరు మీద ఉన్న టీమిండియా మూడో టెస్ట్ మ్యాచ్లో కూడా విజయం సాధించి ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకుంటుందని గట్టిగా నమ్మారు భారత క్రికెట్ అభిమానులు. కానీ ఊహించని రీతిలో ఇండోర్ వేదికగా జరిగిన మూడవ టెస్టులో టీమిండియా పూర్తిగా చేతులెత్తేసింది.

 అప్పటివరకు జరిగిన రెండు మ్యాచ్లలో కూడా ప్రత్యర్ధికి గెలిచేందుకు ఎక్కడ అవకాశం ఇవ్వని టీమిండియా జట్టు.. మూడో టెస్ట్ మ్యాచ్లో మాత్రం ప్రత్యర్థికి పోటీ ఇవ్వలేకపోయింది. ఒకవైపు భారత పిచ్ పై అటు ప్రత్యర్థి జట్టు అద్భుతంగా రానిస్తుంటే టీమిండియా బ్యాటింగ్ బౌలింగ్ విభాగం మాత్రం ఎక్కడ ప్రభావం చూపు లేకపోయింది అని చెప్పాలి. ఏకంగా ఆస్ట్రేలియా చేతిలో సొంత గడ్డపై భారత జట్టు 9 వికెట్ల తేడాతో ఘోర పరాభవాన్ని చవిచూసింది. ఈ క్రమంలోనే భారత జట్టు ప్రదర్శన పై తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా వస్తున్నాయని చెప్పాలి.

 ఈ క్రమంలోని ఇదే విషయంపై స్పందించిన భారత లెజెండరి ప్లేయర్ సునీల్ గవాస్కర్  ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా బ్యాట్స్మెన్ల మెదడులతో ఇండోర్ పిచ్ ఒక ఆట ఆడుకుంది అంటూ గవాస్కర్ వ్యాఖ్యానించాడు. భారత పిచ్ లను గమనిస్తే వికెట్ ఫలానా విధంగా స్పందిస్తుందన్న అంచనా తో షాట్లు ఆడటం ద్వారా మన బ్యాట్స్మెన్లు ఎప్పుడు వికెట్ కోల్పోతూ ఉంటారు.  నిజానికి టీమిండియా బ్యాట్స్మెన్లలో ఆత్మవిశ్వాసం ఎక్కడ కనిపించలేదు. తొలి రెండు టెస్టుల్లో రోహిత్ శర్మ ఆకట్టుకున్నాడు. నాగపూర్ లో అద్భుతమైన సెంచరీ చేశాడు. కానీ ఇండోర్లో అతను బ్యాటింగ్ లో కాస్త అస్థిరత   కనిపించింది. భారత బ్యాట్స్మెన్లు అవసరమైన మేరకు వికెట్ల ముందుకు వచ్చి ఆడ లేకపోయారు అంటూ సునీల్ గవాస్కర్ వ్యాఖ్యానించాడు. తమపై ఆధిపత్యాన్ని చలాయించే హక్కు పూర్తిగా భారత బ్యాట్స్మెన్లు పిచ్ కే ఇచ్చారు అంటూ కామెంట్ చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: