ఇదేంట్రా బాబు.. రోహిత్ కి శాపం తగిలిందా ఏంటి?

praveen
ప్రస్తుతం ఆస్ట్రేలియా తో టెస్టు సిరీస్ ఆడుతున్న భారత జట్టు మొదటి రెండు టెస్ట్ మ్యాచ్లో కూడా అదరగొట్టింది అని చెప్పాలి. అయితే ఒకవైపు బ్యాటింగ్లో పెద్దగా ఆకట్టుకోలేక పోయినప్పటికీ స్పిన్ విభాగం మొత్తం ఇక ఆస్ట్రేలియా బ్యాటింగ్ విభాగాన్ని చిత్తు చేసి జట్టుకు విజయాన్ని అందించడంలో కీలకపాత్ర వహించింది. అయితే మొదటి రెండు మ్యాచ్లలో భారత బ్యాటింగ్ విభాగం పరవాలేదు అని అనిపించినప్పటికీ ఇక మూడవ టెస్ట్ మ్యాచ్లో మాత్రం పరుగులు చేయడానికి నానా తంటాలు  పడుతుంది టీమ్ ఇండియా.

 ఏ స్పిన్ బౌలింగ్ తో అయితే అటు ఆస్ట్రేలియాను టీమిండియా దెబ్బ కొట్టిందో.. ఇక ఇప్పుడు అదే స్పిన్నర్లు భారత బ్యాట్స్మెన్లను  తెగ ఇబ్బందులు పెట్టేస్తూ ఉన్నారు. దీంతో పరుగులు చేయలేక వికెట్ సమర్పించుకొని పెవీలియన్ చేరుతున్నారు భారత క్రికెటర్లు. అయితే మొదటి రెండు మ్యాచ్లలో కూడా మంచి ప్రదర్శన చేసిన కెప్టెన్ రోహిత్ శర్మ ఇక మూడవ టెస్ట్ మ్యాచ్లో మాత్రం పూర్తిగా విఫలం అవుతూ ఉన్నాడు అని చెప్పాలి. మూడో టెస్ట్ మ్యాచ్ లో మొదటి ఇన్నింగ్స్ లో 12 పరుగుల వద్ద ఆస్ట్రేలియా బౌలర్ కునమన్ బౌలింగ్లో  క్యాచ్ ఇచ్చి పెవిలియన్  చేరిన రోహిత్ శర్మ ఇక రెండో ఇన్నింగ్స్ లో  లియోన్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యుగా 12 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు.

 అయితే ఇలా మూడో టెస్టులో రెండు ఇన్నింగ్స్ లో కూడా 12 పరుగులకే అటు రోహిత్ శర్మ అవుట్ కావడంపై అటు ఎంతో మంది నెటిజన్స్ జోకులు పేలుస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇక మరోవైపు కేఎల్ రాహుల్ స్థానంలో వాడిన శుభమన్ గిల్ కూడా ఫెయిల్ అయ్యాడు అని చెప్పాలి.  లియోన్ వేసిన బంతిని ముందుకు వచ్చి ఆడేందుకు ప్రయత్నించిన రోహిత్ శర్మ విఫలం అయ్యాడు. దీంతో అది ప్యాడ్స్ కి తాకింది. ఇక ఆస్ట్రేలియా ఫీల్డర్లు ఎంతో కాన్ఫిడెంట్గా ఎల్పీ అవుట్ కోసం అప్పీల్ చేశారు. దీంతో థర్డ్ అంపైర్ అవుట్ గా ప్రకటించాడు అని చెప్పాలి.

 ఈ క్రమంలోనే రోహిత్ శర్మ పై ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు. నెటిజెన్స్ రోహిత్ చేసే పనులన్నీ ఇలాగే ఉన్నాయి అంటూ కొంతమంది ఫ్యాన్స్ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతకుముందు డిఆర్ఎస్ ను అనవసరంగా వేస్ట్ చేయడం.. ఇక రెండో రోజు ఆట మొదలైన తర్వాత ఆలస్యంగా బౌలింగ్ చేయించడం.. ఇలా రోహిత్ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నాడని మండిపడుతున్నారు. ఇవన్నీ చాలవు అన్నట్టు ఇక అభిమానులకు బంపర్ ఆఫర్ ఇచ్చినట్లుగా ఒకే స్కోర్ వద్ద రెండు ఇన్నింగ్స్ లలో అవుట్ అయ్యాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. రోహిత్ కు ఏమైనా శాపం తగిలిందా అని మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: