ప్రియురాలితో ఎంగేజ్మెంట్ చేసుకున్న.. మహిళా క్రికెటర్?

praveen
సాధారణంగా అయితే సినీ సెలెబ్రిటీలకు కేవలం ఒకే ప్రాంతంలో అభిమానులు ఉంటారు. కొన్ని కొన్ని సార్లు ఇక దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకోవడం లాంటివి కూడా జరుగుతూ ఉంటుంది. కానీ సినీ సెలెబ్రెటీలతో పోల్చి చూస్తే క్రికెటర్లకు కాస్త ఎక్కువగా క్రేజీ ఉంటుంది. ఒకసారి అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేసి బాగా రాణించిన తర్వాత దేశ విదేశాల్లో కూడా వారికి ఎంతో మంది క్రికెట్ ప్రేక్షకులు అభిమానులుగా మారిపోతూ ఉంటారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే అంతర్జాతీయ క్రికెట్లో స్టార్ క్రికెటర్లుగా కొనసాగుతున్న వారు ఏం చేసినా కూడా కెమెరాలు ఒక కంట కనిపెడుతూనే ఉంటాయి. అందుకే ఇలా స్టార్ క్రికెటర్లకు సంబంధించిన ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాయి అని చెప్పాలి.

 ముఖ్యంగా స్టార్ క్రికెటర్లకు సంబంధించిన ప్రేమ పెళ్లి వ్యవహారాలు అయితే అభిమానుల దృష్టిని చాలా ఆకర్షిస్తూ ఉంటాయి. సాధారణంగా స్టార్ క్రికెటర్ గా కొనసాగుతున్న ఒక వ్యక్తి తన ప్రియురాలని పెళ్లి చేసుకుంటేనే అది హాట్ టాపిక్ గా మారుతుంది. అలాంటిది ఇక్కడ ఒక మహిళా ప్లేయర్ ఏకంగా తన ప్రియురాలని పెళ్లి చేసుకుంటే.. మహిళా ప్లేయర్ ఏంటి? ప్రియురాలిని పెళ్లి చేసుకోవడం ఏంటి అని అనుకుంటున్నారు కదా. నిజంగానే ఇక్కడ అదే జరిగింది. ఇంగ్లాండ్ మహిళ క్రికెటర్ డేనియల్ వ్యాట్ ఇటీవల తన ప్రియురాలితో ఎంగేజ్మెంట్ చేసుకుంది.

 క్రికెటర్ డేనియల్ వ్యాట్ లెస్బియన్ అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమె తన ప్రేయసి మాజీ క్రికెటర్ అయిన జార్జి హెగ్డే తో నిశ్చితార్థం చేసుకుంది. ఇక ఈ విషయాన్ని తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో అభిమానులతో పంచుకుంది అని చెప్పాలి. అంతే కాదు తన ప్రియురాలితో లిప్ లాక్ ఇస్తున్నట్లుగా ఒక ఫోటోని కూడా షేర్ చేసింది. అయితే కొన్నెళ్ల నుంచి వీరిద్దరూ డేటింగ్ లో ఉండగా.. 2020లో ఇక ఆమె లేస్బియన్ అనే విషయాన్ని ప్రపంచానికి తెలియజేసింది అని చెప్పాలి. కాగా ఇంగ్లాండుకు చెందిన మరొక క్రికెటర్ సారా టేలర్ సైతం ఇక తన ప్రేయసి తల్లి కాబోతుంది అన్న విషయాన్ని ఇటీవల సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుని సర్ప్రైజ్ ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: