హమ్మయ్యా.. ఎట్టకేలకు అశ్విన్ సాధించాడబ్బా?

praveen
భారత బౌలర్  రవిచంద్రన్ అశ్విన్ ఐసిసి ప్రకటించిన టెస్ట్ బౌలర్ల ర్యాంకర్ల జాబితాలో అగ్ర స్థానం నిలిచాడు. ఇంత వరకు టాప్ పొజిషన్ లో ఉన్న ఆండర్సన్ ని దాటి రవిచంద్రన్ అశ్విన్ ఈ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. గత కొద్దీ కాలం క్రితమే ఆండర్సన్ టెస్ట్ బౌలర్ల ర్యాంకింగ్ లో టాప్ పొజిషన్ కి చేరుకోగా, అతడి కన్నా ముందు ఆసీస్ టీమ్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ ఈ లిస్ట్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉండేవాడు. ఇక రవిచంద్రన్ అశ్విన్ మొదటి స్థానానికి చేరుకోవడానికి అయన ఖాతాలో 864 రేటింగ్ పాయింట్స్ ఉన్నాయ్. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ లో భాగం గా రెండవ టెస్ట్ మ్యాచ్ లో అశ్విన్ ఏకంగా ఆరు వికెట్స్ పడగొట్టడం తో టెస్ట్ బౌలర్ల జాబితాలో మొదటి స్థానం దక్కింది.
ఇక మొదటి స్థానం లో ఉన్న రవి చంద్ర అశ్విన్ కి 864 రేటింగ్ పాయింట్స్ తో ఉండగా, ఇక ఆండర్సన్ 866 పాయింట్స్ తో మొదటి స్థానం లో ఉండగా తన పాయింట్స్ లో ఏడూ రేటింగ్స్ తగ్గిపోవడం తో జాబితాలో వెనక్కి వెళ్ళిపోయాడు. ఇక మరొక భరత్ బౌలర్ బుమ్రా ఈ జాబితాలో ఐదవ స్థానం లో ఉండగా, 795 పాయింట్స్ తో తన ర్యాంకింగ్ ని మెరుగు పరుచుకొని ఒక స్థానం ఎగబాకి నాల్గవ స్థానం లో ఉన్నాడు.
 బుమ్రా స్థానంలోకి పాకిస్థాన్ బౌలర్ షాహిద్ ఆఫ్రిది చేరగా, రవి చంద్రన్ అశ్విన్ అల్ రౌండర్ల ర్యాంకింగ్స్ లో కూడా రెండవ స్థానంలో కొనసాగుతున్నాడు. మొదటి స్థానం లో జడేజా ఉండగా,  టీమ్స్ విషయానికి వస్తే ఆసీస్ జట్టు ఇప్పటికి అగ్ర స్థానంలో ఉంది. ఇక భరత్ రెండవ స్థానం తో సరిపెట్టుకుంది. ఇక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ నాలుగు టెస్టులను భరత్ నెగ్గిన కూడా తన స్థానంలో పెద్దగా మార్పు ఉండకపోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: