4-0 తో ఆసీస్ ఓడిపోకుండా ఉంటే చాలు : మెక్‌గ్రాత్

praveen
బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ లో భాగం గా భరత్ లో ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు పర్యటిస్తుంది. ఇప్పటికే రెండు టెస్ట్ లు జరగగా రెండిట్లోనూ భరత్ విజయం సాధించడం తో ఆస్ట్రేలియా టీమ్ ఫుల్ షాల్ లో ఉంది. అంతే కాదు ఆస్ట్రేలియా మాజీ కెప్టెయిన్స్, మాజీ ఆటగాళ్లు కూడా విషమయానికి గురవుతున్నారు. ఇక మూడవ టెస్ట్ ప్రారంభం కావడానికి ముందు ఆస్ట్రేలియా జట్టు ఓడిన విధానం పై ఆ జట్టు మాజీ ఆటగాడు మెక్‌గ్రాత్ సంచలన వ్యాఖ్యలు చేసాడు. ఈ అపర్యటనలో మొత్తం నాలుగు టెస్ట్ మ్యాచులు ఉండగా, నాలుగింటిని ఆస్ట్రేలియా చేజార్చుకోకుండా ఉంటె చాలు..ఆస్ట్రేలియా జట్టు బాగా ఆడినట్టు అని భావించచ్చు.
ఇక ఆస్ట్రేలియా జట్టు ఎక్కువగా ఇద్దరు క్రికెటర్స్ పై ఆధారపడటం వల్లనే ఇలాంటి ఓటమి చూడాల్సి వచ్చింది అని మెక్‌గ్రాత్ భావించాడు. స్మిత్, మార్నస్ లబుషేన్‌ వంటి వారు మాత్రం ఆడితే సరిపోదని బ్యాటింగ్ లైనప్ సెట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.  ఇండియన్ స్పిన్నర్ల ను ఎదుర్కోవడం కోసం మంచి స్ట్రాటజీ తో ఆడాలని అభిప్రాయపడ్డాడు. అన్నిటికన్నా ముఖ్యంగా ఎక్కడ ఆత్మవిశ్వాసం పోకుండా ఉండాలని సూచించాడు. ముందు ఆడిన రెండు టెస్ట్ మ్యాచుల్లో పరాజయం పాలవ్వడానికి కారణం భారత స్పిన్నర్ల వికెట్స్ వేటాడటమే అని చెప్పుకోచ్చారు.
 ఇప్పటికి భరత్ ఈ సిరీస్ లో 2-౦ ఆధిక్యం లో ఉండగా మూడవ టెస్ట్ మ్యాచ్ కోసం ఇండోర్ వేదిక సిద్ధంగా ఉంది. ఈ మ్యాచ్ లో నెగ్గితే భరత్ టెస్ట్ ప్రపంచ ఛాంపియన్షిప్ ఫైనల్ కి అర్హత సాధిస్తుంది. ఇప్పటికే ఆస్ట్రేలియా ప్రపంచ ఛాంపియన్షిప్ ఫైనల్ కి చేరుకుంది.  జూన్ నెలలో ఇంగ్లాండ్ లోని ఓవల్ స్టేడియం లో ఈ ప్రపంచ ఛాంపియన్షిప్ జరుగనుంది. ఇదివరకు జరిగిన ఈ ఛాంపియన్షిప్ లో భరత్ న్యూజిలాండ్ చేతిలో ఓటమి పాలయ్యింది. విరాట్ కోహ్లీ కెప్టెన్ గా వ్యవహరించగా, ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ గా జెమీసన్ నిలిచాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: