రెమ్యూనరేషన్ విషయంలో.. ప్రభాస్ ను దాటేసిన పవన్ కళ్యాణ్?

praveen
టాలీవుడ్ లోనే కాదు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అత్యధిక పారితోషకం అందుకుంటున్న హీరో ఎవరు అంటే టాలీవుడ్ డార్లింగ్ ప్రభాస్ అని చెబుతారు సినీ ప్రేక్షకులందరూ. ఎందుకంటే బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. బాలీవుడ్ దర్శకుడు సైతం ప్రభాస్ డేట్స్ కోసం నిరీక్షణగా ఎదురుచూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక గ్లోబల్ స్టార్ గా మారిపోయిన తర్వాత ప్రభాస్ ఒక్కో సినిమాకి 120 కోట్ల నుండి 150 కోట్ల పారితోషకం అందుకుంటున్నాడు అన్నది తెలుస్తుంది. ఇక ఇప్పుడు ఆది పురుష్, సలార్, ప్రాజెక్టు కే అనే పాన్ ఇండియా రేంజ్ సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నాడు ప్రభాస్.

 అయితే ప్రభాస్ ను మించిన రెమ్యూనరేషన్ తీసుకోవాలంటే అంత సులభమైన విషయం కాదు అని సినీ ప్రేక్షకులు కూడా అనుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నే మించబోతున్నారట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.డార్లింగ్ ప్రభాస్ ని మించిన రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నారని వార్త ఇప్పుడు ఇంటర్నెట్ను షేక్ చేస్తుంది అని చెప్పాలి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నాలుగు సినిమాల్లో నటిస్తున్నారు
 ఇందులో హరిహర వీలమళ్లు షూటింగ్ శరవేగంగా  జరుగుతుంది. చివరికి దశకు కూడా చేరుకుంది అని చెప్పాలి. ఆ తర్వాత వినోదాయ సీతం అనే సినిమా ప్రారంభం అయి రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది.

 ఇక మరోవైపు హరిశంకర్ తో వస్తాద్ భగత్ సింగ్,  సుజిత్ తో ఓజి సినిమాలలో నటించబోతున్నారు. అయితే వినోదయ సీతం సినిమాకి 25 రోజులు, వస్తాద్ భగత్ సింగ్ సినిమాకి 35 రోజులు, ఓ జి సినిమాకి 30 రోజులు డేట్స్ కేటాయించారట పవన్ కళ్యాణ్. ఇలా నెల లేకపోతే 40 రోజుల్లో ఒక్కో సినిమా షూటింగ్ కంప్లీట్ చేయనున్నారు. ఎందుకంటే అటు రాజకీయాలను కూడా బ్యాలెన్స్ చేయాల్సి ఉంది .

కాబట్టి అదే ఒక్కో సినిమాకి పవన్ 50 కోట్లు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు పారితోషకం 75 కోట్లకు చేశారట. ఈ లెక్కన చూసుకుంటే పవన్ పారితోషికం రోజుకి రెండు కోట్ల నుంచి మూడు కోట్ల వరకు ఉంటుంది. అయితే సుజిత్ దర్శకత్వంలో వచ్చే ఓజి సినిమాకు మాత్రం పవన్ 160 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నారు అన్నది తెలుస్తుంది. ఈ సినిమాను రెండు పార్ట్ లుగా విభజించగా.. ఒక్కో పార్ట్ కి 80 కోట్లు పవన్ కి ఇవ్వబోతున్నారట. దీన్నిబట్టి ఇక రెండు పార్ట్ లకు కలిపి 160 కోట్లు పవన్ కళ్యాణ్ కు వస్తుంది. ఇక ఇది ప్రభాస్ కంటే ఎక్కువ కావడంతో గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: