పిచ్చి కాకపోతే.. నీకు సూర్య కుమార్ తో పోలికేంటి?

praveen
ప్రస్తుతం పాకిస్తాన్ ఆటగాళ్ళతో పాటు మరికొంతమంది విదేశీ ఆటగాళ్లు కూడా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నిర్వహిస్తున్న పిఎస్ఎల్ లో బిజీగా ఉన్నారు అన్న విషయం తెలిసిందే. వరుసగా మ్యాచ్లు ఆడుతున్నారు. అయితే ఇక పాకిస్తాన్ సూపర్ లీగ్ లో భాగంగా ఎంతో మంది యువ ఆటగాళ్లు కూడా తెరమీదికి వచ్చి తమ ప్రదర్శనతో ఆకట్టుకుంటూ ఉన్నారు అని చెప్పాలి. ఇలా ఈ లీగ్ లో సూపర్ ఇన్నింగ్స్ ఆడుతూ ఇక ప్రశంసలు అందుకుంటున్న యువ ఆటగాళ్లు కూడా చాలామంది ఉన్నారు. ఈ క్రమంలోనే  ఇటీవల పాకిస్తాన్ సూపర్ లీగ్ లో భాగంగా పాక్ మాజీ  మోయిన్ ఖాన్ తనయుడు ఆజాంఖాన్ ఆడుతున్నాడు.

 ఇస్లామాబాద్ యునైటెడ్కు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే మెరుపు బ్యాటింగ్తో అతను తరచు వార్తల్లో నిలుస్తూ ఉన్నాడు. ఇటీవల క్వీట గ్లాడియేటర్స్ తో జరిగిన మ్యాచ్లో ఒకరకంగా చెప్పాలంటే పరుగుల సునామీ సృష్టించాడు. 42 బంతుల్లో 9 ఫోర్లు ఎనిమిది సిక్సర్ల  సహాయంతో 97 పరుగులు చేశాడు ఈ 24 ఏళ్ల రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. ఈ క్రమంలోనే అతనిపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ సూర్య కుమార్ యాదవ్ తో పోలుస్తూ ఉన్నారు అని చెప్పాలి. అయితే సూర్యకుమార్తో పోల్చడం గురించి స్పందించిన ఆజాం ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సూర్య కుమార్ కాదు తనకు ఆస్ట్రేలియా ప్లేయర్ టీమ్ డేవిడ్ స్ఫూర్తిదాయకం అంటూ చెప్పుకొచ్చాడు.

 బ్యాటింగ్ ఆర్డర్లో నా స్థానం ఏంటో చెప్పాల్సిన పనిలేదు. 40 కి నాలుగు వికెట్లు పడిన సందర్భాల్లో కూడా బ్యాటింగ్కు వచ్చి మ్యాచ్ ఫినిష్ చేయాల్సి ఉంటుంది. ఇది చాలా కష్టంతో కూడుకున్న పని. ఈ విషయంలో నేను ఆస్ట్రేలియా ప్లేయర్ టిమ్ డేవిడ్ ను చూసి చాలా నేర్చుకుంటున్నా.. అతడిలా భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నిస్తున్న.. అయితే జట్టుకు ఏమి కావాలో టిమ్ డేవిడ్ అదే చేస్తాడు. నేను అతనిలాగే ఐదో స్థానంలో బ్యాటింగ్కు వస్తాను కదా అంటూ చెప్పుకొచ్చాడు. అయితే సూర్యకుమార్ మాత్రం ఎక్కువగా వన్ డౌన్ లో వస్తాడు. టాప్ ఆర్డర్లో ఆడటానికి... నా బ్యాటింగ్ పొజిషన్ కి చాలా తేడా ఉంటుంది అంటూ ఆజాద్ ఖాన్ చెప్పుకొచ్చాడు. అయినా నీకు సూర్యతో పోలికేంటి అతను గ్రేట్ క్రికెటర్ అంటూ ఇండియన్ ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: