WPL : గుజరాత్ జెయింట్స్ కెప్టెన్ గా ఎవరో తెలుసా?

praveen
మార్చి 31వ తేదీ నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం కాబోతుంది. అయితే భారత అభిమానులు అందరూ కూడా ఈ లీగ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే మార్చి 31 వ తేదీ నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం కావడానికి ముందే మార్చి 4వ తేదీ నుంచి అసలు సిసలైన క్రికెట్ మజా మొదలు కాబోతుంది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే బీసీసీఐ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ఈ ఏడాది నుంచి ప్రారంభం కాబోతుంది. ఇక లీగ్ లో భాగంగా మొదటి మ్యాచ్ ఇక మార్చి 4వ తేదీనా జరగబోతుంది అన్న విషయం తెలిసిందే.

 ఈ క్రమంలోనే ఇలా ఉమెన్స్ ప్రీమియర్ లీగ్  ముగిసిన వెంటనే ఇండియన్ ప్రీమియర్ లీగ్ చూసేందుకు అభిమానులు అందరూ కూడా సిద్ధమైపోయారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన షెడ్యూల్ కూడా విడుదల కావడంతో ఇప్పటికే అన్ని జట్లు కూడా ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ కోసం సిద్ధమవుతూ ఉన్నాయి అని చెప్పాలి. ప్రత్యర్థులను ఎలా ఎదుర్కోవాలి అనే విషయంపై ఇక  వ్యూహాలను కూడా సిద్ధం చేసుకుంటూ ఉన్నాయి. కాగా ప్రస్తుతం కొన్ని జట్లు తమ జట్టుకు కెప్టెన్లను ప్రకటించే పనిలో బిజీబిజీగా ఉన్నాయి అని చెప్పాలి.

 ఈ క్రమంలోనే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో ఒక జట్టుగా కొనసాగుతున్న గుజరాత్ జెయింట్స్ టీం ఇక ఇప్పుడు తమ జట్టు కెప్టెన్ ఎవరు అనే విషయంపై అధికారిక ప్రకటన చేసింది. బెత్ మూనిని తమ జట్టుకు సారథిగా నియమిస్తున్నట్లు ప్రకటించింది. కాగా బెత్ మూని ఉమెన్స్ టి20 వరల్డ్ కప్ గెలిచిన అసిస్ టీంలో కీలకపాత్ర పోషించింది అని చెప్పాలి. ఇటీవలే జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఏకంగా 53 బంతుల్లోనే 74 పరుగులు చేసి అదరగొట్టింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఈ ప్లేయర్ కే అటు గుజరాత్ జట్టు యాజమాన్యం కెప్టెన్సీ ఇచ్చేందుకు మొగ్గు చూపింది అన్నది తెలుస్తుంది. కాగా మార్చి 4వ తేదీన ముంబై, గుజరాత్ జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగబోతుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: