బాబర్ వారసుడిగా.. కెప్టెన్ గా అతనే సరైనోడు : షోయబ్ అక్తర్

praveen
పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్  ఇక ఇటీవల కాలంలో తన కామెంట్స్ తో ఎప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతున్నాడు అన్న విషయం తెలిసిందే. తన యూట్యూబ్ ఛానల్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు. అయితే పాకిస్తాన్ క్రికెటర్లకు ఇంగ్లీష్ మాట్లాడటం రాదని అందుకే అంతర్జాతీయ మ్యాచ్లలో అవార్డు ప్రజెంటేషన్ సమయంలో ఇంగ్లీష్ మాట్లాడటానికి ఎంతో ఇబ్బంది పడతారు అంటూ షోయబ్ అక్తర్ వ్యాఖ్యానించాడు. ఇక ఇలా ఇంగ్లీష్ రాకపోవడం కారణంగానే బాబర్ అత్యుత్తమ ఆటగాడు అయినప్పటికీ బ్రాండ్ అంబాసిడర్ గా మారలేకపోయాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

 ఇక ఇప్పుడు బాబర్ అజాం తర్వాత ఎవరు కెప్టెన్సీ బాధ్యతలను చేపడితే బాగుంటుంది అనే విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బాబర్ వారసుడిగా పాకిస్తాన్ ఆల్ రౌండర్ షాదాబ్ ఖాన్ వన్డే, టీ20 లకు సారథ్యం వహిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు
 షాదాబ్ ఖాన్ చాలా తెలివైనవాడు. అతనిలో ఉన్న క్రికెట్ నైపుణ్యం కూడా అద్భుతం.  బాగా బౌలింగ్ చేసేందుకు ఎంతగానో కష్టపడతాడు. అంతేకాదు ఫిట్నెస్ కూడా ఎంతగానో మెరుగుపడింది. ఇక అన్నింటికీ మించి  అతను అద్భుతంగా మాట్లాడగలడు అంటూ షోయబ్ అక్తర్ చెప్పుకొచ్చాడు. గత ఏడాది ఆస్ట్రేలియాలో జరిగిన టి20 వరల్డ్ కప్ లో కూడా షాదాబ్ ఖాన్ పాకిస్తాన్కు వైస్ కెప్టెన్ గా వ్యవహరించాడు.

 ఇదిలా ఉంటే గత కొంతకాలం నుంచి బాబర్ను కెప్టెన్సీ నుంచి తొలగించాలి అంటూ డిమాండ్లు ఎక్కువైపోయాయి అన్న విషయం తెలిసిందే.  ప్రస్తుతం పాకిస్తాన్ జట్టుకు మూడు ఫార్మట్లలో కెప్టెన్ గా కొనసాగుతున్న బాబర్ ఇటీవల కాలంలో స్వదేశంలో జరుగుతున్న సిరీస్లలో మాత్రం తన కెప్టెన్సీ తో ఎలాంటి ప్రభావం చూపలేకపోయాడు. ఇంగ్లాండ్ న్యూజిలాండ్ చేతిలో టెస్ట్ వన్డే సిరీస్లలో కూడా బాబర్ కెప్టెన్సీలో పాకిస్తాన్ ఘోరంగా ఓడిపోయింది. దీంతో ఇక బాబర్ను వన్డే  టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పించాలని డిమాండ్ వస్తున్న నేపథ్యంలో  షోయబ్ అక్తర్ షాదాబ్ ఖాన్ పేరు తెరమీదకి తీసుకురావడం హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: