ఆ ఒక్క ఓవర్ వల్ల.. నెల రోజులు ఏడ్చాను : ఇషాంత్ శర్మ

praveen
టీమిండియా సీనియర్ బౌలర్ అయిన ఇషాంత్ శర్మ గురించి దాదాపు ఇక ప్రేక్షకులకు తెలుసు. ఎందుకంటే ఇప్పుడంటే జూనియర్ల హవా పెరిగిపోవడంతో ఇక సీనియర్గా ముద్రపడిన ఇశాంత్  శర్మకు జట్టులో చోటు దక్కడం లేదు. కానీ ఒకప్పుడు మాత్రం టీమిండియాలో కీలక బౌలర్గా కొనసాగాడు. తన అద్భుతమైన బౌలింగ్ ప్రతిభతో ప్రత్యర్థులకు ముచ్చమటలు పట్టించాడు అని చెప్పాలి. ఇక టీమిండియా విజయంలో కీలక పాత్ర వహించి ఎన్నో ప్రపంచ రికార్డులను కొల్లగొట్టాడు ఇశాంత్  శర్మ. ఇక తర్వాత కాలంలో ఫామ్ కోల్పోవడం.. ఇక టీమిండియాలో యువ ఆటగాళ్ళ హవా పెరిగిపోవడంతో అతనికి జట్టులో ఛాన్స్ రావడం లేదు.

 ఇకపోతే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఇశాంత్ శర్మ తన కెరియర్లో అత్యంత చెత్త బౌలింగ్ అనుభవం గురించి చెప్పుకొచ్చాడు. 2013లో ఆస్ట్రేలియా తో మొహాలీ వేదికగా జరిగిన వన్డే మ్యాచ్లో భారత జట్టు ఓడిపోయిన తర్వాత తాను నెలరోజుల పాటు ఏడుస్తూనే ఉన్నాను అంటూ ఇశాంత్ శర్మ చెప్పుకొచ్చాడు. తన స్నేహితురాలు తనను ఎంతగానో ఓదార్చేదని.. ఇక ప్రతిరోజు ఆమెకి ఫోన్ చేసి బాధపడే వాడిని అని ఇషాంత్ శర్మ ఇటీవల ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాన్ని చెప్పారు. కాగా మొహాలీలో పదేళ్ల క్రితం జరిగిన వన్డే మ్యాచ్లో టీమ్ ఇండియా పై ఆస్ట్రేలియా గెలవాలంటే మూడు ఓవర్లలో 44 పరుగులు చేయాల్సి ఉంది.

 ఈ క్రమంలోనే టీమ్ ఇండియాదే విజయం అని అందరూ భావించారు. ఇలాంటి సమయంలో బౌలింగ్ చేయడానికి వచ్చిన ఇషాంత్ శర్మ ఒకే ఓవర్లో 30 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో ఆస్ట్రేలియాకు టార్గెట్ చేదించడం ఎంతో సులభంగా మారిపోయింది. అలవోకగా విజయం సాధించింది. ఇక అప్పట్లో 30 పరుగులు సమర్పించుకున్న ఇషాన్ శర్మ పై విమర్శలు కూడా వచ్చాయి. ఈ క్రమంలోనే 2013లో మొహాలు లో ఆస్ట్రేలియా తో జరిగిన వన్డే మ్యాచ్ నాకు బ్యాడ్ టైమ్. కెరియర్ లో అంతకంటే దారుణమైన సమయం ఉండదు. అది చాలా కష్టమైన సమయం. నేను ఎక్కువ పరుగులు ఇచ్చినందుకు నా వలన జట్టు ఓడిపోయిందని బాధ నన్ను కుంగ తీసింది. ఆ సమయంలో నెలరోజుల పాటు ఏడ్చాను అంటూ ఇషాంత్ శర్మ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: