ఐపీఎల్ : కొత్త కెప్టెన్లతో బరిలోకి దిగుతున్న జట్లు ఇవే?

praveen
మార్చి 31 వ తేదీ నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం కాబోతుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ లీగ్ కోసం అటు భారత క్రికెట్ ప్రేక్షకులందరూ కూడా వేయి కలతో ఎదురుచూస్తూ ఉన్నారు. అదే సమయంలో గత ఏడాది చివర్లో జరిగిన వేలంలో ఎంతోమంది ఆటగాళ్లు ఒక జట్టు నుంచి మరో జట్టుకు వెళ్లారు. ఇక కొన్ని జట్లకు కెప్టెన్లు కూడా మారిపోయారు అని చెప్పాలి. దీంతో ఏ జట్టు ప్రదర్శన ఎలా ఉంటుంది అనేదానిపై ఒక అంచనాకు కూడా రాలేకపోతున్నారు క్రికెట్ విశ్లేషకులు. దీంతో ఈసారి ఐపీఎల్ పోరు మరింత రసవతారంగా మారబోతుంది అన్నది మాత్రం తెలుస్తూ ఉంది.

 ఇకపోతే కొన్ని ఫ్రాంచైజీలు తమ జట్టులోకి కొత్త ఆటగాళ్ళను కొనుగోలు చేసి జట్టును పటిష్టంగా మార్చుకున్నాయి. మరికొన్ని ఫ్రాంచైజీలు మాత్రం ఏకంగా జట్టుకు కెప్టెన్నే మార్చేశాయి అని చెప్పాలి. మరి 2023 ఐపీఎల్ సీజన్లో ఇలా కొత్త కెప్టెన్లతో బరిలోకి దిగుతున్న జట్లు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం..
 సన్రైజర్స్ హైదరాబాద్  : భారీ ధర పెట్టి మయాంక్ అగర్వాల్ ని కొనుగోలు చేసిన నేపథ్యంలో  అతనికి కెప్టెన్సీ అప్పగిస్తారని అందరూ అనుకున్నారు. కానీ దక్షిణాఫ్రికా టీ20 లీగ్ లో సన్రైజర్స్ ఫ్రాంచైజీకి కెప్టెన్ గా ఉన్న ఐడెం మార్కరమ్ తొలి ప్రయత్నం లోనే టైటిల్ అందించాడు. దీంతో ఇక ఐపీఎల్ లో కూడా కెప్టెన్సీ విషయంలో అతని వైపే మొగ్గు చూపింది సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు యాజమాన్యం. ఇటీవల అధికారిక ప్రకటన చేసింది.

 ఢిల్లీ క్యాపిటల్స్  : ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్  రోడ్డు ప్రమాదం బారిన పడ్డాడు. దీంతో ఐపీఎల్ సీజన్ కి అందుబాటులో ఉండలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఇక ఆ జట్టుకు కొత్త కెప్టెన్ కావాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో జట్టులో సీనియర్ గా ఆటగాడిగా ఉన్న డేవిడ్ వార్నర్ కి సారధ్య బాధ్యతలు అప్పగించే ఛాన్స్ ఉంది. ఈ అధికారిక ప్రకటన చేయకపోయినా ఇప్పటికే జట్టు యాజమాన్యం వార్నర్ కు కెప్టెన్సీ అప్పగించేందుకు ఫిక్స్ అయింది అన్నది తెలుస్తుంది.

 పంజాబ్ కింగ్స్ : గత కొంతకాలం నుంచి పంజాబ్ కింగ్స్ వరసగా కెప్టెన్లను మారుస్తూ ఉంది. 2021 సీజన్లో కేఎల్ రాహుల్, 2022 సీజన్ లో మయాంక్ అగర్వాల్  ఇక ఇప్పుడు కొత్త కెప్టెన్గా శిఖర్ ధావన్ కు బాధ్యతలను అప్పగించింది పంజాబ్ కింగ్స్  యాజమాన్యం. మయాంక్ అగర్వాల్ ను టీం నుంచి రిలీజ్ చేసి ఇక శిఖర్ ధావన్ కు సారధ్య బాధ్యతలు అప్పగించారు అని చెప్పాలి. ఇక కొత్త కెప్టెన్ తో ఈసారి అయినా ఛాంపియన్గా నిలవాలని భావిస్తూ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: