టీమిండియా వరల్డ్ కప్ గెలవాలంటే.. అతన్ని కోచ్ చేయండి : హార్భజన్

praveen
2007లో టి20 ప్రపంచ కప్ ను సొంతం చేసుకున్న టీమ్ ఇండియా జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది అన్న విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత టీమ్ ఇండియాకు ఎంతో మంది కెప్టెన్లు మారినప్పటికీ ఇక టి20 వరల్డ్ కప్ విజేతగా నిలవాలనే కోరిక మాత్రం తీరడం లేదు అని చెప్పాలి.  అయితే గత ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టి20 వరల్డ్ కప్ లో తప్పకుండా భారత జట్టు విశ్వవిజేతగా నిలుస్తుంది అని భారీగానే అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. కానీ సెమీఫైనల్ లో మాత్రం భారత్ చేతులెత్తేసింది అని చెప్పాలి. ఇంగ్లాండ్ జట్టుకు కనీస పోటీ ఇవ్వలేక 10 వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది భారత జట్టు.

 దీంతో దశాబ్ద కాలానికి పైగా నిరీక్షణగా ఎదురు చూస్తూ ఉండగా ఈ నిరీక్షణకు తెరపడుతుంది అనుకుంటే అలా జరగలేదు. ఈ క్రమంలోనే 2024 టీ20 ప్రపంచ కప్ గురించి ఇక ఇప్పటినుంచే బీసీసిఐ ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగుతుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఇదే విషయంపై ఎంతో మంది మాజీ ఆటగాళ్లు కూడా స్పందిస్తూ తమ అభిప్రాయాలను రివ్యూల రూపంలో చెప్పేస్తూ ఉన్నారు. ఇక ఇటీవల ఇదే విషయంపై టీం ఇండియా మాజీ ప్లేయర్ హర్భజన్ సింగ్ స్పందించాడు.

 టీమిండియా కు ఇద్దరు కెప్టెన్లు ఉన్నారు భిన్నంగా ఎందుకు ఆలోచించకూడదు. ఇంగ్లాండు మేకల్లమ్ ను కోచ్ గా నియమించుకుంది. మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ లేదా ఆశిష్ నెహ్రతో   మనం కూడా ప్రయోగం చేయవచ్చు. ఆశిష్ నెహ్ర కోచింగ్ లోనే హార్దిక్ పాండ్యా ఐపీఎల్ టైటిల్ గెలిచాడు. కాబట్టి టి20 కాన్సెప్టును ఆ ఫార్మాట్ అవసరాలను గుర్తించే వారిని ప్రత్యేకంగా కోచ్గా నియమించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం దృష్టి అంత టి20 పైనే ఉంది. పొట్టి ఫార్మట్ లో భారత జట్టు ఛాంపియన్గా ఎలా తీర్చిదిద్దాలో నెహ్రకు బాగా తెలుసు. ఇక టెస్టులు వన్డేలలో టీమిండియాను అగ్రస్థానానికి చేర్చడానికి అవసరమైన ప్రణాళికలు రాహుల్ ద్రవిడ్ వద్ద ఉన్నాయి అంటూ హర్భజన్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: