కోహ్లి, కేఎల్ రాహుల్ కంటే మెరుగ్గా షమీ గణాంకాలు.. ఆశ్చర్యపోతున్న అభిమానులు?

praveen
ప్రపంచ క్రికెట్‌లో మొనగాడు అనగానే మనకు కోహ్లి గుర్తుకు వస్తాడు. క్లాస్ ఇన్నింగ్స్ అనగానే కేఎల్ రాహుల్ మదిలో మెదులుతాడు. అయితే యావరేజిలో భారత బౌలర్ షమీ వారిద్దరినీ దాటేశాడు. ఇది నమ్మశక్యం కాకపోయినా వాస్తవమిది. ప్రస్తుతం క్రికెటర్ల యావరేజి చూస్తే ఈ విషయం బయటపడింది. కొన్నాళ్లుగా కేఎల్ రాహుల్ ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్నాడు. దీంతో పరుగులు చేయలేక సతమతం అవుతున్నాడు. ఫలితంగా టీమిండియా వైస్ కెప్టెన్ స్థానం కూడా కోల్పోయాడు. ఈ తరుణంలో యావరేజి చాలా తక్కువగా నమోదవుతుంది. కేఎల్ రాహుల్‌తో పాటు ఇటీవల కాలం లో భారత క్రికెటర్ల యావరేజ్ చూద్దాం.
ప్రస్తుతం ఆస్ట్రేలియా తో జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ లో కేఎల్ రాహుల్ ఇప్పటివరకు 3 ఇన్నింగ్స్ ఆడాడు. దీనిలో అతను 12.66 సగటు  తో కేవలం 38 పరుగులు మాత్రమే సాధించగలిగాడు. ఆశ్చర్యకరం గా జట్టులో 10వ స్థానంలో బ్యాటింగ్ చేస్తున్న ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ షమీ 2 ఇన్నింగ్స్‌లలో 39 పరుగులు చేశాడు. 21.8 సగటు నమోదు చేశాడు. ఇటువంటి పరిస్థితిలో ఈ పేలవమైన ఫామ్ వల్ల కేఎల్ రాహుల్ మూడవ టెస్ట్ మ్యాచ్‌లో ఆడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇప్పటికే భారత్ ఈ సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలో ఉంది. ఇక గత ఏడాది కాలంలో భారత క్రికెటర్ల యావరేజి చూస్తే రవీంద్ర జడేజా 70.7 సగటుతో ముందంజలో ఉన్నాడు. ఆ తర్వాతి స్థానంలో 67 సగటుతో రిషబ్ పంత్ రెండో స్థానంలో ఉన్నాడు. ఇక మూడో స్థానంలో 48.7 సగటుతో శ్రేయస్ అయ్యర్ నాలుగో స్థానంలో, 48.2 సగటుతో ఛతేశ్వర్ పూజారా తర్వాతి స్థానంలో ఉన్నారు. అశ్విన్ 37 సగటు, అక్షర్ పటేల్ 32.6 సగటును సాధించారు. వీరందరి వెనుకనే విరాట్ కోహ్లి 21.2 సగటుతో ఉండడం ఆశ్చర్యకరంగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: