కొత్త కెప్టెన్ ప్రకటన.. సన్రైజర్స్ సారధి ఎవరంటే?

praveen
భారత క్రికెట్ ప్రేక్షకులందరూ కూడా ఎప్పుడెప్పుడ అని ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ మార్చి 31 వ తేదీ నుంచి ప్రారంభం కాబోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఏ జట్టు ప్రదర్శన ఎలా ఉంటుంది అనేదానిపై ఎంతోమంది మాజీ ఆటగాళ్లు స్పందిస్తూ తమ రివ్యూలను సోషల్ మీడియా వేదికగా చెబుతూ ఉన్నారు. అయితే గత ఏడాది డిసెంబర్లో జరిగిన వేలంలో ఇక అన్ని ఫ్రాంచైజీలు  కూడా తమ జట్టులోని కొంతమంది ఆటగాళ్లను వదులుకోవడమే కాదు కొత్త ఆటగాళ్లని జట్టులోకి తీసుకుంటూ ఉన్నాయి.

 ఈ క్రమంలోనే సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు యాజమాన్యం సైతం ఇక ఇలాంటిదే చేసింది. కానీ ఏకంగా కెప్టెన్ కేన్ విలియమ్స్ ను జట్టు నుంచి మెగా వేలంలోకి వదిలేసి అందరికి షాక్ ఇచ్చింది అని చెప్పాలి. దీంతో సన్రైజర్స్ కు ఇక కెప్టెన్సీ ఇచ్చేందుకు ఎవరిని మళ్ళీ జట్టులోకి కొనుగోలు చేస్తుంది అన్నది ఆసక్తికరంగా మారిపోయింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే మయాంక్ అగర్వాల్ ను జట్టులోకి తీసుకున్నారు అన్న విషయం తెలిసిందే. అయితే దీంతో మయాంక్ అగర్వాల్ కి అటు కెప్టెన్సీ అప్పగిస్తారు అని అందరూ భావించారు. కానీ ఊహించిన రీతిలో కొత్త పేరును ప్రకటించింది సన్రైజర్స్ యాజమాన్యం.

 సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు నూతన కెప్టెన్ గా మార్కరమ్ ను నియమిస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. మయాంక్ అగర్వాల్ పేరు పరిశీలనలో ఉన్నప్పటికీ మార్కరమ్ వైపే మొగ్గుచూపింది. సన్రైజర్స్ హైదరాబాద్ ఇక ఇటీవల సౌత్ ఆఫ్రికా టీ20 లీగ్ లో సన్రైజర్స్ ఈస్టర్న్ జట్టుకు కూడా మార్కరమ్ సారథ్యం వహిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. మొదటి ప్రయత్నంలోనే జట్టుకు టైటిల్ అందించాడు. ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు. ఈ క్రమంలోనే ఇక మయాంక్ అగర్వాల్ ఉన్నప్పటికీ కూడా సన్రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం మార్కరమ్ వైపే మొగ్గు చూపింది అన్నది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Srh

సంబంధిత వార్తలు: