ఐసీసీ ర్యాంకింగ్స్.. అశ్విన్ దూసుకొచ్చాడుగా?

praveen
ప్రస్తుతం టీమిండియాలో సీనియర్ బౌలర్గా కొనసాగుతున్న రవిచంద్రన్ అశ్విన్ తన స్పిన్ బౌలింగ్ తో ఎంతలా మాయ చేస్తూ ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అశ్విన్ బౌలింగ్ చేయడానికి వచ్చాడు అంటే చాలు ప్రత్యర్థులు వికెట్ కాపాడుకొని ఎంతో ఆచితూచి ఆడటానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఇలా ఎప్పుడూ అద్భుతమైన ప్రదర్శన చేసే రవిచంద్రన్ అశ్విన్ ఇక భారత జట్టు తరఫున ఒక లెజెండరీ స్పిన్నర్ గా కొనసాగుతూ ఉన్నాడు. ఆ గత కొంతకాలం నుంచి మంచి ప్రదర్శన కనబరుస్తూ ఇక ప్రస్తుతం ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో సత్తా చాటుతూ వస్తున్నాడు అని చెప్పాలి.

 ఇక ఎక్కడ ఫామ్ కోల్పోకుండా మంచి ప్రదర్శన చేస్తూ ఎక్కువ వికెట్లు పడగొడుతూ ఇక అదరగొడుతూ ఉన్నాడు. యువ ఆటగాళ్ల పోటీని తట్టుకొని జట్టులో తన స్థానాన్ని  ఎప్పటికప్పుడు పదిలం చేసుకుంటూనే ఉన్నాడు.  అయితే అలాంటి రవిచంద్రన్ అశ్విన్ కి ఇటీవలే ఐసీసీ ర్యాంకింగ్స్  లో సత్తా చాటాడు . ఇటీవల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మంచి ప్రదర్శన చేసి తన ర్యాంకును మెరుగుపరుచుకున్నాడు. ఇంగ్లాండ్ సీనియర్ ఫేసర్ అయిన జేమ్స్ అండర్సన్ ఇటీవలే ప్రకటించిన టెస్ట్ రాంకింగ్స్ లో నెంబర్ వన్ బౌలర్గా అవతరించాడు అని చెప్పాలి.. న్యూజిలాండ్తో ఇటీవల జరిగిన తొలి టెస్ట్ లో ఏడు వికెట్లతో సత్తా చాటి ఇలా నెంబర్ వన్ స్థానానికి చేరుకున్నారు అని చెప్పాలి.

 కాగా జేమ్స్ అండర్సన్  నెంబర్ వన్ స్థానంలోకి చేరుకోవడం ఇది ఆరోసారి అని చెప్పాలి. అయితే జేమ్స్ అండర్సన్ కంటే రెండు పాయింట్లు తక్కువ ఉండడంతో అశ్విన్ రెండవ స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఇదిలా ఉంటే అటు భారత బౌలర్ అశ్విన్ నుంచి అగ్రస్థానానికి ముప్పు పొంచి ఉంది. ఎందుకంటే జేమ్స్ అండర్సన్ న్యూజిలాండ్తో ఇంకా ఒక టెస్ట్ మ్యాచ్ మాత్రమే ఆడాల్సి ఉంది. అయితే అటు రవిచంద్రన్ అశ్విన్ మాత్రం ప్రస్తుతం ఆస్ట్రేలియాతో రెండు టెస్ట్ మ్యాచ్ లలో కూడా ఆడతాడు. ఈ క్రమంలోనే ఎక్కువ వికెట్లు పడగొడితే అగ్రస్థానాన్ని సొంతం చేసుకునే అవకాశం ఉంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: