టి20 ఫార్మాట్లో.. భారత్ నుండి ఎక్కువ పరుగులు చేసింది ఎవరంటే?

praveen
టి20 ఫార్మాట్ అంటేనే బ్యాట్స్ మెన్  విద్వాంసానికి మారుపేరు అన్న విషయం తెలిసిందే. ఒకసారి బ్యాట్స్మెన్ బరిలోకి దిగాడు అంటే చాలు అద్భుతమైన ప్రదర్శన చేసి తమ సత్తా ఏంటో చూపిస్తూ ఉంటారు.  అంతేకాకుండా తక్కువ బంతుల్లో ఎక్కువ పరుగులు చేయాల్సిన ఒత్తిడి ప్రతి బ్యాట్స్ మెన్ పై ఉంటుంది. కాబట్టి ఇక క్రీజు లోకి రావడం రావడమే.. సిక్సర్లు పోర్లతో చెలరేగిపోతూ ఉంటారూ. ఇలా పవర్ హిట్టింగ్ చేయాలనే ప్లాన్ తో వచ్చే బ్యాట్స్మెన్ లను కట్టడి చేయడం బౌలర్లకు పెద్ద సవాలుతో కూడుకున్నది అని చెప్పాలి.

 ఈ క్రమంలోనే ఎంతోమంది బ్యాట్స్మెన్లు భారీగా పరుగులు చేయడంలో సక్సెస్ అయితే కొంతమంది మాత్రం భారీ షాట్లు కొట్టడానికి ప్రయత్నించి ఒత్తిడికి తల వంచి చివరికి వికెట్ కోల్పోతూ ఉంటారు అని చెప్పాలి. ఇకపోతే ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ లో భాగంగా భారత మహిళా జట్టు కెప్టెన్ గా ఉన్న హర్మన్ ప్రీత్ కౌర్ ఇటీవల ఒక అరుదైన రికార్డు సాధించింది అన్న విషయం తెలిసిందే  ఏకంగా టి20 ఫార్మాట్లో 3000 పరుగుల మైలు రాయిని అందుకుంది  ఈ ఘనత సాధించిన మొదటి మహిళా క్రికెటర్ గా రికార్డ్ సృష్టించింది హర్మాన్ ప్రీత్.

 ఈ క్రమంలోనే భారత క్రికెట్ నుంచి టి20 ఫార్మాట్లో ఎక్కువ పరుగులు చేసిన ఆటగాళ్లు ఎవరు అన్నది కూడా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇక ఒకసారి ఆ లిస్టు తీసుకుంటే రన్ మిషన్ విరాట్ కోహ్లీ ఈ లిస్ట్ లో టాప్ లో ఉన్నాడు. ఏకంగా ఇప్పటివరకు టి20 ఫార్మాట్ లో 4008 పరుగులు చేశాడు  ఇక ఆ తర్వాత ప్రస్తుత టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ 3853 పరుగులతో రెండవ స్థానంలో కొనసాగుతున్నాడు.ఆ తర్వాత హర్మన్ ప్రీత్ 3006 పరుగులతో మూడవ స్థానంలో, స్మృతి మందాన 2800 వందల పరుగులు, మిథాలీ రాజ్ 2364, కేఎల్ రాహుల్ 2265 పరుగులతో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: