టీమిండియాకు కీలక మ్యాచ్.. గెలిస్తే ముందుకి.. ఓడితే ఇంటికి?

praveen
ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా వేదికగా మహిళల టి20 వరల్డ్ కప్ జరుగుతుంది అని చెప్పాలి. ఇక ఈ మెగా టోర్నీలో ప్రతి మ్యాచ్ కూడా ఉత్కంఠ భరితంగా సాగుతోంది. ఇక ప్రతి జట్టు కూడా టైటిల్ గెలవడమే లక్ష్యంగా హోరాహోరీ పోరు కొనసాగిస్తూ ఉంది. అయితే భారత జట్టు కూడా ఇదే రీతిలో పోరాడుతూ ఉంది అని చెప్పాలి. మొదటి మ్యాచ్ లో పాకిస్తాన్ తో పోటీపడి గెలిచిన టీమిండియా జట్టు ఇక ఆ తర్వాత వెస్టిండీస్ ను కూడా అలవోకగా ఓడించి ఘనవిజయాన్ని అందుకుంది అని చెప్పాలి. అయితే ఇక ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో కూడా విజయం సాధించి సెమీఫైనల్ లో అడుగుపెడుతుందని అందరూ భావించారు.

 కానీ ఎన్ని విధాలుగా ప్రయత్నించినప్పటికీ అటుపటిష్టమైన ఇంగ్లాండును మాత్రం టీమిండియా మహిళల జట్టు ఓడించలేకపోయింది అని చెప్పాలి. ఇకపోతే ఇప్పుడు మహిళల టీ20 ప్రపంచ కప్ లో భారత జట్టుకు కీలకమైన పోరుకు రంగం సిద్ధమైంది. నేడు ఐర్లాండ్ ను ఢీకొట్టబోతుంది హార్మన్ ప్రీత్ కౌర్ సేన. అయితే ఈ మ్యాచ్ లో గెలిచిందంటే చాలు భారత జట్టు ఎలాంటి సమీకరణలతో సంబంధం లేకుండా సెమీఫైనల్ లో అడుగుపెడుతుంది అని చెప్పాలి. మూడు మ్యాచ్ లలో రెండు విజయాలతో నాలుగు పాయింట్లు సాధించి రెండవ స్థానంలో ఉంది. అగ్రస్థానంలో ఉన్న ఇంగ్లాండ్ 3 మ్యాచ్లో విజయం సాధించి ఆరు పాయింట్ల తో సెమీస్ బెర్త్  ఖాయం చేసుకుంది. మరి ఈ కీలకమైన టీమిండియా ఎలా రాణిస్తుందో చూడాలి మరి.

 అయితే ప్రస్తుతం వరుస విజయాలు సాధించి పటిష్టంగా కనిపిస్తున్న టీమిండియా. పసి కూనా టీం అయినా ఐర్లాండ్ పై విజయం సాధించడం పెద్ద విషయం కాదు అని క్రికెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు అని చెప్పాలి. అదే సమయంలో ఇక పసికూన అని తక్కువ అంచనా వేసి బరిలోకి దిగితే.. పటిష్టమైన జట్లు సైతం బంగబడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఈ క్రమంలోనే ప్రతి మ్యాచ్ ను కూడా కీలకంగా భావించి ఐర్లాండ్తో 100% ఎఫర్ట్  పెడితేనే టీమ్ ఇండియా ఘన విజయాన్ని సాధించి మంచి రన్ రేట్ సాధించే అవకాశం ఉంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: