11 బంతులు.. 0 పరుగులు, 4 వికెట్లు.. ఇది కదా టీమ్ ఇండియా దెబ్బ?

praveen
భారత పర్యటనకు వచ్చి ఇక్కడ నాలుగు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడుతున్న ఆస్ట్రేలియా జట్టును భారత బౌలింగ్ విభాగం ముప్పు తిప్పులు పెడుతుంది అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే నాగపూర్ వేదికగా జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్లో పటిష్టంగా ఉన్న ఆస్ట్రేలియాను కోలుకోలేని దెబ్బ  కొట్టింది భారత బౌలింగ్ విభాగం. ఇక ఈ మ్యాచ్ లో 132 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే ఇక ఇప్పుడు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న రెండోవ టెస్ట్ మ్యాచ్ లోను ఇదే జోరుని కొనసాగిస్తుంది భారత బౌలింగ్ విభాగం. ఒకవైపు బ్యాట్స్మెన్లను తక్కువ పరుగులకు కట్టడి చేయడమే కాదు మరోవైపు ఇక వెంట వెంటనే వికెట్లు పడగొడుతూ ప్రత్యర్థిని కోలుకోలేని దెబ్బ కొడుతుంది అని చెప్పాలి.

 అయితే రెండో టెస్ట్ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ లో కూడా భారత బౌలింగ్ విభాగం మంచి ప్రదర్శన చేసింది. అయితే ఆ తర్వాత బ్యాట్స్మెన్లు కాస్త తడబడటంతో ఆస్ట్రేలియాను పరుగుల విషయంలో టీమిండియా అధిగమించలేకపోయింది. అయితే ఇక ఇప్పుడు రెండో టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో మరోసారి టీమిండియా బౌలింగ్ విభాగం సత్తా ఏంటో చూపించింది అని చెప్పాలి. మొత్తంగా రెండో ఇన్నింగ్స్ లో రవీంద్ర జడేజా తన స్పిన్ బౌలింగ్ తో అదరగొట్టి ఏకంగా ఏడు వికెట్లు తీసుకున్నాడు. దీంతో ఇక ఆస్ట్రేలియా జట్టు 113 పరుగులకే కుప్పకూలిపోయింది అని చెప్పాలి.

 అయితే కేవలం 11 బంతుల్లోనే రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలు ఈ నాలుగు వికెట్లు తీసి ఔరా అనిపించారు. అయితే ఈ 11 బంతుల గ్యాప్ లో ఒక్క పరుగు కూడా ఇవ్వకుండానే బ్యాట్స్మెన్లను వరుసగా అవుట్ చేస్తూ పెవెలియన్ పంపించారు అని చెప్పాలి. ఇక దీన్ని బట్టి అటు భారత బౌలింగ్ విభాగం ఏ రేంజ్ లో ఆస్ట్రేలియా పై విరుచుకుపడుతుంది అన్నది అర్థమవుతుంది అని చెప్పాలి. అశ్విన్ జడేజా ఇలా వరుసగా వికెట్లు తీయడంతో మ్యాచ్ మరింత ఇంట్రెస్టింగ్ గా మారగా.. చివరికి 113 పరుగులకు ఆస్ట్రేలియా ఆల్ అవుట్ అయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: