నా కెరియర్లో.. అదే బెస్ట్ ఇన్నింగ్స్ : క్రిస్ గేల్

praveen
వెస్టిండీస్ క్రికెటర్లు పవర్ హిట్టింగ్ కి పెట్టింది పేరు అన్న విషయం తెలిసిందే. ఒకసారి మైదానంలో కుదురుకున్నారు అంటే చాలు వారు బ్యాటింగ్లో సృష్టించే విధ్వంసం గురించి మాటల్లో వర్ణించడం చాలా కష్టం. ఇక వెస్టిండీస్ క్రికెట్ నుంచి ఇలాంటి విధ్వంసకల బ్యాట్స్మెన్లు చాలా మందే వెలుగులోకి వచ్చారు. తమ అద్భుతమైన బ్యాటింగ్ తో ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరికీ కూడా తమ అభిమానులుగా మార్చుకున్నారు అని చెప్పాలి. ఇలా ఏకంగా తన ఆట తీరుతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్న ప్లేయర్లలో క్రిస్ గేల్ ముందు వరుసలో ఉంటాడు అని చెప్పాలి.

 ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా క్రిస్ గేల్ ని యూనివర్సల్ బాస్ అని ఎంతో ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు. ఇక క్రిస్ గేల్ ఒక్కసారి క్రీజూలో కుదురుకున్నాడు అంటే ఇక అతను బ్యాటింగ్లో సృష్టించే విధ్వంసం గురించి ఎంత చెప్పినా తక్కువే. సిక్స్సర్లు ఫోర్ లతో  విరుచుకుపడుతూ బౌలర్ల ఖాతాలో వరస్టు రికార్డులు చేరిపోయేలా వీర విహారం చేస్తూ ఉంటాడు. కేవలం వెస్టిండీస్ జట్టు తరఫున మాత్రమే కాదు ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు సహా మరికొన్ని టీమ్స్ తరఫున కూడా ఆడి  ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు.

 ఇకపోతే ఒక ఇంటర్వ్యూలో భాగంగా తన కెరియర్ మొత్తంలో బెస్ట్ ఇన్నింగ్స్ ఏంటి అన్న విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు క్రిస్ గేల్. ఆర్సీబీ జట్టు తరపున ఆడుతున్న సమయంలో పూనే వారియర్స్ పై 66 బంతుల్లో సిక్సర్లు ఫోర్లతో చెలరేగి పోయిన క్రిస్ గేల్ 175 పరుగులు చేశాడు. అయితే ఇదే తన కెరీర్ లో అత్యుత్తమమైన ఇన్నింగ్స్ అంటూ యూనివర్సల్ బాస్ చెప్పుకొచ్చాడు. 2013లో కేవలం 30 బంతుల్లోనే సెంచరీ చేయడం నాకు ఇప్పటికీ గుర్తుకు ఉంది. ప్రతి బంతి స్టాండ్స్ అవుతలే ఉన్నట్లు అనిపించింది. అందుకే అది నా కెరియర్ లో నెంబర్ వన్ ఇన్నింగ్స్ గా మారింది అంటూ క్రీస్ గేల్ సమాధానం చెప్పాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: