చరిత్ర సృష్టించిన.. పాకిస్తాన్ మహిళా క్రికెటర్?

praveen
టి20 ఫార్మాట్ లో బ్యాట్స్మెన్లలో ఎప్పుడూ హవా నడుస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే క్రీజు లోకి వచ్చిన ప్రతి బ్యాట్స్మెన్ కూడా తమ బ్యాట్ తో మెరుపులు మెరిపించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే ప్రేక్షకులకు కావలసిన సిక్సర్లు ఫోర్లు టి20 ఫార్మాట్ లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అని చెప్పాలి. అయితే ఇలా కేవలం పురుషుల క్రికెట్లో మాత్రమే కాదు మహిళల క్రికెట్లో కూడా ఇదే రేంజ్ లో బ్యాటింగ్ విధ్వంసం కొనసాగుతూ ఉంటుంది. కేవలం తక్కువ బంతుల్లో ఎక్కువ పరుగులు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఒకవేళ క్రీజు లోకి బౌలర్లు బ్యాటింగ్ చేయడానికి వచ్చిన కూడా భారీ సిక్సర్లు కొట్టేందుకే ప్రయత్నిస్తూ ఉంటారు.

 అలాంటిది ఇక టి20 ఫార్మాట్లో స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ గా కొనసాగుతున్న వారు వీర విహారం చేయకుండా ఎలా ఉంటారు. అందుకే టి20 ఫార్మాట్లో స్టార్ బ్యాట్స్మెన్ లకు బౌలింగ్ చేయడం అనేది అటు బౌలర్లకు కత్తి మీద సాము లాంటిదే. ఎందుకంటే వికెట్ తీస్తే పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేసే అభిమానులు ఒకవేళ మంచి బౌలింగ్ ప్రదర్శన చేయకపోతే మాత్రం చివరికి విమర్శలు గుప్పిస్తూ ఉంటారు. అయితే ఇటీవల కాలంలో టి20 ఫార్మాట్లో ఎంతో మంది క్రికెటర్లు అద్భుతమైన ప్రదర్శన చేసి ప్రపంచ రికార్డులు కొల్లగొడుతున్నారు అన్న విషయం తెలిసిందే.

 ఇకపోతే ఇటీవలే పాకిస్తాన్ మహిళల జట్టులో కీలక బ్యాటర్ గా కొనసాగుతున్న మునిబా అలీ ఏకంగా ఒక అరుదైన రికార్డును సృష్టించింది. ప్రస్తుతం సౌతాఫ్రికా వేదికగా జరుగుతున్న టి20 వరల్డ్ కప్ లో ఇక పాకిస్తాన్ జట్టులో ఆడుతుంది మునిబా అలీ. అయితే ఇటీవల ఐర్లాండ్తో జరిగిన సెంచరీ తో అదరగొట్టింది. దీంతో సెంచరీ చేసిన తొలి పాకిస్తాన్ మహిళా క్రికెటర్ గా నిలిచింది. మహిళల టి20 క్రికెట్లు ఇప్పటివరకు 38 సెంచరీలు నమోదు కాగా.. పాకిస్తాన్ నుంచి ఇప్పటివరకు మునిబా మాత్రమే సెంచరీ చేసింది అని చెప్పాలి. దీంతో ఇక ఈ బ్యాటర్ ప్రదర్శన పై ఎంతో మంది మాజీ ఆటగాళ్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: