ఆస్ట్రేలియాను .. భారత్ వైట్ వాష్ చేస్తుంది : సైమన్ డౌల్

praveen
ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు భారత పర్యటనకు వచ్చింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే భారత పర్యటనలో భాగంగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆడుతుంది. ఈ క్రమంలోనే నాలుగు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లో భాగంగా ఇప్పటికే ఒక టెస్ట్ మ్యాచ్ ముగిసింది అన్న విషయం తెలిసిందే. అయితే భారత జట్టు స్వదేశీ పరిస్థితిలను బాగా వినియోగించుకుని ఇక ప్రత్యర్థి ఆస్ట్రేలియాను ముప్పు తిప్పులు పెడుతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మొదటి టెస్ట్ మ్యాచ్ లోనే అటు ఆస్ట్రేలియా బ్యాటింగ్ విభాగంలో బౌలింగ్ విభాగంలో కూడా పూర్తిగా తేలిపోయింది.

 ఇక రెండోవ టెస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియా ప్రదర్శన ఎలా ఉంటుంది అన్నది కూడా ఆసక్తికరంగా మారిపోయింది అని చెప్పాలి. అయితే ఇక ప్రస్తుతం నాలుగు మ్యాచ్ల టెస్టు సిరీస్ లో భాగంగా ఏ జట్టు గెలుస్తుంది అనే విషయంపై అటు ఇప్పటికే ఎంతో మంది మాజీ ఆటగాళ్లు తమ రివ్యూలను సోషల్ మీడియా వేదికగా చెప్పేస్తూ ఉన్నారు. న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ సైమన్ డౌల్ సైతం ఇక ఈ టెస్ట్ సిరీస్ లో ఎవరు విజయం సాధిస్తారు అనే విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా జట్టును టీమిండియా జట్టు క్లీన్ స్వీప్ చేయడం ఖాయం అంటూ సైమన్ డౌల్ అభిప్రాయం వ్యక్తం చేశాడు అని చెప్పాలి.

 ఒకవేళ ఈ సిరీస్లో ఆస్ట్రేలియా గనుక విజయం సాధిస్తే అది ఆశ్చర్యకరమైన విషయమే అంటూ చెప్పుకొచ్చాడు. ఒకవేళ వర్షం అంతరాయం కలిగించకపోతే 4-0 తేడాతో భారత జట్టు ఈ సిరీస్ ని కైవసం చేసుకుంటుంది అంటూ ముందుగానే జోష్యం చెప్పాడు సైమన్ డౌల్. ఒక్క మ్యాచ్లో ఆస్ట్రేలియా నెగ్గిన నిజంగా అది ఆశ్చర్యకరమైన విషయమే. ఒకవేళ ఆస్ట్రేలియా బౌలర్లు బంతితో రాణిస్తే లేదా స్మిత్, లబుషన్ బాగా పోరాడితే.. ఒక టెస్టులో ఆస్ట్రేలియా విజయం సాధించే ఛాన్స్ ఉంది. నాకైతే ఈ సిరీస్ ని భారత జట్టు 3-1 లేదా 4-0 తేడాతో కైవసం చేసుకుంటుంది అని అనిపిస్తుంది అంటూ సైమన్ డౌల్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: