రవిశాస్త్రి లేకపోతే.. అతను రిటర్మెంట్ ప్రకటించేవాడు?

praveen
ప్రస్తుతం టీమిండియాలో కీలక బౌలర్గా కొనసాగుతున్నాడు మహమ్మద్ షమి.   ఎంతో మంది యువకులు జట్టులోకి వచ్చి సత్తా చాటుతున్నప్పటికీ.. ఇక తన ప్రతిభను ఎప్పటికప్పుడు కొత్తగా నిరూపించుకుంటూ సత్తా చాటుతూ ఉన్నాడు అని చెప్పాలి. ఇక ప్రస్తుతం టి20 ఫార్మాట్లో మాత్రమే కాదు వన్డే టెస్ట్ ఫార్మట్ లో కూడా అవకాశాలు దక్కించుకుంటూ ఉన్నాడు. అయితే ఒకప్పుడు ఇక భార్యతో విడాకుల తర్వాత డిప్రెషన్ లోకి వెళ్లిపోయి కెరియర్లో గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్న మహమ్మద్ షమీ మళ్లీ తిరిగి పుంజుకొని టీమిండియాలోకి వస్తాడని ఎవరు అనుకోలేదు. ఇక అతని కెరీర్ ముగిసిపోయిందని రిటైర్మెంట్ ప్రకటిస్తాడని ఎంతోమంది భావించారు.

 ఇలాంటి సమయంలో ఇక జట్టులో అప్పటికే యువ ఆట గాళ్ళ నుండి పోటీ ఎక్కువగా ఉన్న సమయంలో దేశవాళి క్రికెట్లో మంచి ప్రదర్శన చేసి మళ్లీ టీమిండియాలోకి అడుగు పెట్టాడు. ఇక ఆ తర్వాత మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదు అని చెప్పాలి. అద్భుతమైన ప్రదర్శనతో ఇక టీమిండియా విషయంలో కీలకపాత్ర వహిస్తూ జట్టులో కీలక బౌలర్గా కొనసాగుతూ ఉన్నాడు మహమ్మద్ షమి. ఇక ఇప్పుడు ఆస్ట్రేలియాతో జరగబోయే కీలకమైన టెస్ట్ సిరీస్ లో కూడా జట్టులో భాగం అయ్యాడు అన్న విషయం తెలిసిందే. అయితే భారత బౌలర్ షమీ ఐదేళ్ల క్రితమే క్రికెట్కు గుడ్ బై చెప్పాలని  అనుకున్నాడంటూ భారత మాజీ బౌలింగ్ భరత్ అరుణ్ ఆసక్తికర బ్యాంకులో చేశాడు.

 అయితే మహమ్మద్ షమీ ఇలా రిటైర్మెంట్ ఆలోచనల్లో ఉన్న సమయంలో ఇక మాజీ కోచ్ రవి శాస్త్రి కలగజేసుకోవడం వల్లే షమీ రిటైర్మెంట్ ఆలోచనను వెనక్కి తీసుకున్నాడు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు  చేసాడు. రవి శాస్త్రి మహమ్మద్ షమి మద్దతుగా నిలవడంతో.. ఇక ఇప్పుడు మహమ్మద్ షమి కెరియర్ను సాఫీగా కొనసాగిస్తున్నాడని చెప్పుకొచ్చాడు. 2018లో ఇంగ్లాండ్ టూర్కు ముందు ఫిట్నెస్ టెస్టులో విఫలం కావడంతో అతనికి టీం లో చోటు దక్కలేదు. ఆ సమయంలో రిటైర్మెంట్ ప్రకటించాలనుకున్నాడు. కానీ మానసిక ఇబ్బందులతో బాధపడుతున్న మహమ్మద్ షమికి నేషనల్ క్రికెట్ అకాడమీకి వెళ్లాలంటూ రవి శాస్త్రి సలహా ఇచ్చాడు అంటూ భరత్ అరుణ్ చెప్పాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: