ఇది స్మృతి మందాన అంటే.. రావడం రావడమే?

praveen
ప్రస్తుతం భారత మహిళల జట్టు సౌత్ ఆఫ్రికా వేదికగా జరుగుతున్న ఉమెన్ టి20 వరల్డ్ కప్ లో బిజీ బిజీగా ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ వరల్డ్ కప్ లో భాగంగా భారత  జట్టు జైత్రయాత్రను కొనసాగిస్తూ ఉంది. ఇక ఈ మెగా టోర్నీలో మొదటి మ్యాచ్ చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్తాన్తో ఆడింది.. ఇక ఈ మ్యాచ్ లో పూర్తి ఆధిపత్యాన్ని కనబరిచిన టీమ్ ఇండియా జట్టు ఘనవిజయాన్ని అందుకుంది అని చెప్పాలి. వరల్డ్ కప్ లో భాగంగా వెస్టిండీస్ తో జరిగిన రెండవ మ్యాచ్ లో కూడా ఇదే జోరును కొనసాగించి విజయాన్ని అందుకుంది టీం ఇండియా జట్టు.

 అయితే పాకిస్తాన్ తో జరిగిన మొదటి మ్యాచ్ లో అటు భారత మహిళల జట్టులో కీలక ప్లేయర్గా కొనసాగుతున్న ఓపెనర్స్ స్మృతి మందాన దూరం అయింది అని చెప్పాలి. అయితే ఇక వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో మాత్రం మళ్లీ జట్టులోకి వచ్చింది. ఇక ఇలా రావడం రావడమే ఒక స్టంనింగ్ క్యాచ్ పట్టి అభిమానులందరినీ కూడా సంతోషంలో ముంచేసింది అని చెప్పాలి. 13 ఓవర్లు ముగిసే సరికి ఒకే ఒక వికెట్ కోల్పోయిన వెస్టిండీస్ జట్టు 75 పరుగుల వద్ద ఎంతో పటిష్టంగా కనిపించింది. ఈ క్రమంలోనే దీప్తి శర్మ బౌలింగ్ వేయడానికి వచ్చింది.

 కాగా ఇన్నింగ్స్ 14వ ఓవర్లో మూడో బంతిని వెస్టిండీస్ బ్యాటర్ క్యాంప్ బెళ్ళే రివర్స్ స్వీప్ ఆడాలని ప్రయత్నించింది. అయితే బంతి బ్యాట్ ఎడ్జ్ కు తాకడంతో స్లిప్ లో పడింది. ఇక అక్కడే ఫీల్డింగ్  చేస్తున్న స్మృతి మందాన పాదరసంలా ముందుకు కదిలింది. క్యాంప్ బెళ్ళే ఆడిన బంతిని కాస్త ముందుకు పడటంతో మందాన డైవ్ చేసి మరి ఒంటి చేత్తో స్టన్నింగ్ క్యాచ్ అందుకుంది. దీంతో 73 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది అని చెప్పాలి.  ఇక ఆ తర్వాత భారత బౌలర్లు మరింత పట్టు బిగించడంతో చివరికి వెస్టిండీస్ బ్యాటర్లు అందరూ కూడా విలువిలలాడిపోయారు. ఈ స్టన్నింగ్ క్యాచ్ తర్వాత స్మృతి మందాన పేరు స్టేడియంలో మారు మోగిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: