మేం ప్రపంచంలో ఎక్కడైనా గెలవగలం : అండర్సన్

praveen
ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో మేటి జట్లుగా కొనసాగుతున్న అన్ని జట్లు కూడా ప్రస్తుతం సాంప్రదాయమైన క్రికెట్ అయినా టెస్ట్ ఫార్మాట్లో బిజీబిజీగా ఉన్నాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇప్పటికే ఆస్ట్రేలియా జట్టు భారత పర్యటనకు వచ్చి ఇండియాలో ఆతిధ్య భారత జట్టుతో ఇక నాలుగు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడుతుంది. ఇక ఇప్పటికే ఇరు జట్ల మధ్య మొదటి మ్యాచ్ హోరా హోరిగా జరగగా ఇక ఈ నెల 17వ తేదీన 2వ టెస్ట్ మ్యాచ్ జరగబోతుంది అని చెప్పాలి.  ఇకపోతే మరోవైపు అటు మరో రెండు మేటి జట్లు అయినా ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మధ్య టెస్ట్ సిరీస్ ప్రారంభం కాబోతుంది అని చెప్పాలి.

 ఈ క్రమంలోనే ఈ టెస్ట్ సిరీస్ లో ఎవరు పై చేయి సాధిస్తారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. ఇప్పటికే ఈ టెస్ట్ సిరీస్ గురించి ఎంతోమంది మాజీ ఆటగాళ్లు స్పందిస్తూ ఎవరి ప్రదర్శన ఎలా ఉంటుంది అనేదానిపై తమ రివ్యూలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం చేస్తూ ఉన్నారు. అయితే ఇలా ఇటీవల కాలంలో టెస్ట్ సిరీస్ ప్రారంభం అవుతుందంటే చాలు అంతకుముందే ఆయా జట్లు మైండ్ గేమ్ మొదలు పెడుతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే తమ జట్టు బలాబలాలను చెబుతూ ప్రత్యర్థిని భయపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి.  అదే సమయంలో ఏదో ఒక విధంగా ఇక ప్రత్యర్థి వ్యూహాలను దెబ్బతీసేందుకు మైండ్ గేమ్ ఆడుతూ ఉన్నాయి అని చెప్పాలి.

 ఈ క్రమంలోనే ఇక న్యూజిలాండ్తో ప్రారంభం కాబోయే టెస్టు సిరీస్ నేపథ్యంలో ఇంగ్లాండ్ బౌలర్ జేమ్స్ అండర్సన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తమ జట్టులో అద్భుతమైన పేసర్లు ఉన్నారని బౌలింగ్ యూనిట్ ఎంతో చక్కగా ఉంది అంటూ చెప్పకు వచ్చాడు. తమ జట్టు ప్రపంచంలో ఎక్కడైనా ఎలాంటి పరిస్థితుల్లోనైనా గెలవగలదు అంటూ తెలిపాడు జేమ్స్ అండర్సన్. జోఫ్రా ఆర్చర్ ఫిట్నెస్ సాధించడంతో ఎంతో సంతోషంగా ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. తాము ప్రపంచం క్రికెట్లో నాణ్యమైన బౌలర్లను తయారు చేస్తున్నామంటూ తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: