ప్చ్.. తెలంగాణ అమ్మాయి అన్ సోల్డ్ గా మిగిలిపోయింది?

praveen
భారత క్రికెట్ నియంత్రణ మండలి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ఇక ఇప్పుడు భారత క్రికెటర్ల జీవితాలను మార్చేయబోతుంది అన్నది అర్థమవుతుంది. ఎందుకంటే ఇటీవల జరిగిన మెగా వేలం ప్రక్రియలో భాగంగా ఎంతో మంది టీమిండియా క్రికెటర్లు రికార్డు స్థాయి ధర పలికారు. ఐపీఎల్ లో స్టార్ ప్లేయర్లకు ఎక్కడా తీసిపోని విధంగా కోట్ల రూపాయల ధరను దక్కించుకున్నారు అని చెప్పాలి. మొన్నటి వరకు పురుష క్రికెటర్లతో పోల్చి చూస్తే అంతంత మాత్రం మాత్రమే ఆదరణ దక్కించుకున్న మహిళా క్రికెటర్లు ఇక ఇప్పుడు భారీ ధర పలకడం గమనార్హం.

 దీంతో ఇక మహిళా క్రికెట్లో ఒక సువర్ణ అధ్యాయం మొదలైంది అని చెప్పాలి. అయితే ఇక ఇటీవలే ముంబై వేదికగా జరిగిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మెగా వేలంలో  తెలుగు క్రికెటర్లు కూడా పాల్గొన్నారు. అయితే కర్నూలుకు చెందిన అంజలి శర్వాణి ఏకంగా 55 లక్షల ధర పలికింది. యూపీ వారియర్స్ ఫ్రాంచైజీ అంజలీని దక్కించుకుంది అన్న విషయం తెలిసిందే. అయితే  తెలంగాణ బిడ్డ గొంగిడి త్రిష మాత్రం అటు అన్ సొల్డ్ గా మిగిలిపోయింది. 10 లక్షల బేస్ ప్రైస్ విభాగంలో లిస్టింగ్కు వచ్చినప్పటికీ ఏ ఫ్రాంచైజీ కూడా ఈ యువ ప్లేయర్ ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు.

 అయితే వేలం ట్రెండును బట్టి గొంగిడి త్రిషకు భారీ ధర పలుకుతుంది అని అందరూ ఊహించారు. కానీ ఈ టాలెంటెడ్ యువ ప్లేయర్ ను జట్టులో చేర్చుకునేందుకు ఏ ఫ్రాంచైజీ కూడా ఆసక్తి కనపరచలేదు అని చెప్పాలి. అయితే 17 ఏళ్ల స్పిన్ ఆల్రౌండర్ అయిన త్రిష ఈటీవలే జరిగిన అండర్ 19 టీ20 ప్రపంచ కప్ లో మంచి ప్రదర్శన చేయడం ద్వారా వెలుగులోకి వచ్చింది. అయితే సీనియర్ జట్టుకు ఆడకపోవడమే ఈ అమ్మాయికి మైనస్ అయింది అనేది తెలుస్తుంది. కాకా గొంగిడి త్రిష కాకుండా తెలుగు రాష్ట్రాల నుంచి మరికొంతమంది క్రికెటర్లు వేలంలో పాల్గొని ఆయా ప్రాంచీల తరఫున ఎంపిక అయ్యారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: