డ్రెస్సింగ్ రూమ్ లోనే సిగరెట్ తాగిన హెడ్ కోచ్.. వైరల్ వీడియో?

praveen
గురువులు ఎలా ఉంటే శిష్యులు కూడా అలాగే తయారవుతూ ఉంటారు అని ఎంతో మంది పెద్దలు చెబుతూ ఉంటారు. అందుకే గురువులు ఎప్పుడూ తమ నడవడిక విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలని అంటూ ఉంటారు.. అయితే ఇక క్రికెట్ జట్టుకు కోచ్గా ఉన్న వ్యక్తి కూడా గురువు లాంటివాడే. అందుకే ఆటగాళ్లలో ఎప్పుడు స్ఫూర్తి నింపుతూ ఆట మరింత మెరుగయ్యేందుకు కోచ్ తోడ్పడుతూ ఉంటాడు అని చెప్పాలి. ఏవైనా చెడు అలవాట్లు ఉన్నా కూడా అటు ఆటగాళ్లకు దూరంగానే వాటిని ఉంచటం లాంటివి చేస్తూ ఉంటాడు కోచ్.

 కానీ ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం ఎంతో గౌరవమైన కోచ్ పదవిలో కొనసాగుతూ చేసిన పని కాస్త ప్రస్తుతం తీవ్ర విమర్శలకు దారితీస్తుంది అని చెప్పాలి. ఏకంగా ఒకవైపు మ్యాచ్ జరుగుతున్న సమయంలో డ్రెస్సింగ్ రూమ్ లోనే సిగరెట్ తాగుతూ కెమెరాకు చిక్కాడు. ప్రస్తుతం బిపిఎల్ లీగ్ చివరి దశకు చేరుకుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ లీగ్ లో కూల్నా టైగర్స్ కు హెడ్ కోచ్ వ్యవహరిస్తున్నాడు ఖలీల్ అహ్మద్. ఈ క్రమంలోనే ఇటీవలే కుల్నా టైగర్స్, ఫార్చ్యూన్ బరిశాల మధ్య మ్యాచ్ జరిగింది.  ఈ క్రమంలోనే ఈ మ్యాచ్ జరుగుతుండగా డగ్ అవుట్ లో మ్యాచ్ చూస్తూ సిగరెట్ తాగాడు హెడ్ కోచ్గా ఉన్న ఖలీల్ అహ్మద్.

 డగౌట్ ప్లేయర్ లందరూ కూడా చూస్తుండగానే ఇలాంటి పని చేశాడు అని చెప్పాలి. నిబంధనల ప్రకారం అయితే మ్యాచ్ జరుగుతున్నప్పుడు సిగరెట్ తాగడం మద్యం సేవించడం పూర్తిగా నిషేధం. అయితే ఈ నిబంధనలను గాలికి వదిలేసి సిగరెట్ తాగాడు ఖలీల్ అహ్మద్. ఇందుకు సంబంధించిన వీడియో ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయింది. అయితే ఈ వీడియో పై బంగ్లాదేశ్ క్రికెట్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు  యూరప్ లో ఇలా చేసినందుకు ప్లేయర్లు నిషేధానికి గురవుతారు  అసలు డ్రెస్సింగ్ రూమ్ లో అతను సిగరెట్ ఎలా తాగాడో ఇప్పటికే అర్థం కావట్లేదు కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: