ఈ ముగ్గురుని కోహ్లీతో పోల్చారు.. కానీ అడ్రస్ లేకుండా పోయారు?

praveen
సాధారణంగా క్రికెట్లో అడుగుపెట్టిన తొలినాళ్లలోనే ఎవరైనా ఆటగాడు అద్భుతమైన ప్రదర్శన చేశాడు అంటే చాలు ఇక వారిని అప్పటికే సక్సెస్ అయిన దిగ్గజా ఆటగాళ్లతో పోల్చడం లాంటివి చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో క్రికెట్లో ఎవరైనా అద్భుత ప్రదర్శన చేశారు అంటే చాలు వారిని టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీతో పోల్చి ప్రశంసలు కురిపించడం లాంటివి చేస్తూ ఉంటారు. మాజీ అటగాళ్ళు  విరాట్ కోహ్లీ జట్టులోకి వచ్చినప్పుడు కూడా సచిన్ టెండూల్కర్ తో పోల్చారు అని చెప్పాలి. అయితే ఇలా ఇక సచిన్ తో కోహ్లీని పోలిస్తే అది నిజం చేసి చూపించాడు  కానీ విరాట్ కోహ్లీతో పోల్చిన ముగ్గురు క్రికెటర్లు మాత్రం ప్రస్తుతం కనిపించకుండా పోయారు ఆ వివరాలు చూసుకుంటే..

 ఉన్ముఖ చంద్  : అండర్ 19 ప్రపంచ కప్ లో భారత్ ను విజయపతంలో నడిపించాడు ఢిల్లీ కుర్రాడు. ఆస్ట్రేలియాలో జరిగిన 2012 ఎడిషన్ లో 6 మ్యాచ్లలో 246 పరుగులు చేశాడు. ఇక ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో 111 పరుగులు చేసి ఇండియాకు కప్ అందించాడు.  దీంతో అతన్ని ఫ్యూచర్ కోహ్లీతో  పోల్చారు. ఇక తర్వాత అతను ఐపీఎల్లో కూడా అరంగేట్రం చేశాడు. కానీ 21 గేమ్లలో 15 సగటు 300 పరుగులు మాత్రమే చేయగలిగాడు.  ఇక ఇప్పుడు పూర్తిగా భారత క్రికెట్ నుంచి రిటైర్ అయి బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ లో చటోగ్రామ్ చాలెంజర్స్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

 అహ్మద్ షహజాద్  : పాకిస్తాన్ బ్యాట్స్మెన్ అహ్మద్ షహజాద్ సైతం 2008 అండర్ 19 ప్రపంచకప్ లో అద్భుతంగా రానించాడు. ఇక ఇదే వరల్డ్ కప్ తో కోహ్లీ కూడా వెలుగులోకి వచ్చాడు. అప్పట్లో వీరిద్దరి ఆట తీరును పోల్చుతూ ఎన్నో రివ్యూలు ఇచ్చారు విశ్లేషకులు.  కోహ్లీ తర్వాత ఏడాదికి షహజాద్ కూడా అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసాడు. కానీ కొన్ని రోజుల్లోనే ప్రపంచ క్రికెట్లో కనుమరుకయ్యాడు. కెరియర్ తొలినాళ్లల్లో అతనే ఫ్యూచర్ స్టార్ అని నమ్మకాన్ని కల్పించి.. ఆ తర్వాత నిలకడలేమిటో కనిపించకుండా పోయాడు అని చెప్పాలి. అతను చివరిసారిగా 2019లో శ్రీలంకతో జరిగిన టి20 మ్యాచ్ ఆడాడు.

 ఉమర్ అక్మాల్ : పాకిస్తాన్ క్రికెటర్ ఉమర్ అక్మాల్ 2009లో అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం 19 ఏళ్ల వయసులోనే ఉమర్ టెస్ట్ అరంగేట్రంలో అదరగొట్టాడు. అప్పట్లో మంచి ఫామ్ లో ఉన్న విరాట్ కోహ్లీతో ఉమర్ అక్మాల్ ను పోల్చి చూసారు ఎంతోమంది పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు. కానీ ఇక కెరియర్ తొలినాళ్లలో  తన బ్యాటింగ్లో మెరుపుల మెరిపించిన ఉమర్ అక్మాల్ తర్వాత ఫామ్ కోల్పోయి జట్టుకు దూరమయ్యాడు. 2019లో చివరిసారి పాకిస్తాన్ కు ప్రాతినిధ్యం వహించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: