అతని వల్లే ఈ స్థాయికి వచ్చా : కేఎస్ భరత్

praveen
కె ఎస్ భరత్.. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెగ మారుమోగిపోతుంది  అని చెప్పాలి. ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి భారత అంతర్జాతీయ జట్టులో చోటు కోసం ఎదురుచూస్తున్న ఈ యువ ఆటగాడికి.. ఇక ఇటీవల ప్రతిష్టాత్మకమైన బోర్డర్ కవాస్కర్ ట్రోఫీలో ఆడేందుకు అవకాశం దక్కింది. ఈ క్రమంలోనే ఇక టీమ్ ఇండియా తరఫున తుది జట్టులో కూడా చోటు సంపాదించుకున్నాడు అని చెప్పాలి. అయితే ఇప్పటికే రెండు మూడు సార్లు టీమిండియా తరఫున ఎంపికైనప్పటికీ తుది జట్టులో మాత్రం అతనికి ఛాన్స్ దక్కలేదు. మొదటిసారి ఇక టీమిండియా తరఫున తుది జట్టులోకి వచ్చి మైదానంలోకి బరిలోకి దిగాడు.

 మొదటి టెస్ట్ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ లోనే తన కీపింగ్ తో అదరగొట్టాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక తనకు  అటు టీమ్ ఇండియాలో చోటు దక్కడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ఈ ప్లేయర్. సుదీర్ఘ నిరీక్షణకు ఫలితం దక్కింది అంటూ ఆనందం వ్యక్తం చేశాడు. కుటుంబ సభ్యులు స్నేహితులు కోచ్ల అండదండలతోనే ఈ స్థాయికి చేరుకోగలిగాను అంటూ తెలిపాడు. మహమ్మద్ అజారుద్దీన్ వెంకటపతి రాజు, వివిఎస్ లక్ష్మణ్,  ఎమ్ఎస్కే ప్రసాద్,  మహమ్మద్ సిరాజ్ తర్వాత టెస్ట్ ఆడిన తెలుగు ప్లేయర్ గా నిలిచాడు అని చెప్పాలి.

 సీనియర్ బ్యాట్స్మెన్ శతేశ్వర పూజార చేతుల మీదుగా కేఎస్ భరత్ టీమిండియా క్యాప్ అందుకున్నాడు. అయితే ఇక టీమిండియాలోకి రావడం పై స్పందిస్తూ తన కోచ్ కృష్ణారావు వల్లే ఈ స్థాయికి చేరుకోగలిగాను అంటూ చెప్పుకొచ్చాడు.  భారత్ తరపున ఆడటం ఎంతో సంతోషంగా ఉంది అంటూ తెలిపాడు. ఇది కేవలం నా కల మాత్రమే.  నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరు కూడా నన్ను జట్టులో చూడాలని కోరుకున్నారు. కుటుంబ సభ్యులు కోచులు స్నేహితుల మద్దతు లేకపోతే నేను ఇక్కడ వరకు వచ్చే వాడిని కాదు. ముఖ్యంగా కోచ్ కృష్ణారావు నాలోని ఆటను గమనించి నన్ను మంచి ఆటగాడిగా తీర్చిదిద్దారు అంటూ కేఎస్ భరత్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: