టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ లో ఇందిరానగర్ గుండా.. వైరల్ వీడియో?

praveen
ప్రతిష్టాత్మకమైన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియా ఆస్ట్రేలియా మధ్య 4 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఇటీవలే నాగపూర్  వేదికగా తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైంది అని చెప్పాలి. అయితే తొలి టెస్ట్ మ్యాచ్ తొలి రోజు నుంచి ఆదరగొడుతూ ఉంది టీమిండియా. ఏకంగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియాకు చుక్కలు చూపించింది అని చెప్పాలి. దీంతో భారత బౌలింగ్ దాటికి తట్టుకోలేకపోయిన ఆస్ట్రేలియా జట్టు 177 పరుగులకే ఆల్ అవుట్ అయింది అని చెప్పాలి.  ఆ తర్వాత బ్యాటింగ్ చేస్తున్న టీమిండియా కూడా ఎంతో పటిష్టంగా ఉంది.

 అయితే ఇక ఆస్ట్రేలియా తో సిరీస్ అంటే చాలు టీమ్ ఇండియా ఆటగాళ్లలో ఎక్కడలేని ఉత్సాహం నిండిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే పాకిస్తాన్ తర్వాత అటు భారత జట్టుకు చిరకాల ప్రత్యర్థి ఆస్ట్రేలియా అని కొంతమంది క్రికెట్ ప్రేక్షకులు కూడా అభివర్ణిస్తూ  ఉంటారు. అందుకే ఆస్ట్రేలియాతో మ్యాచ్ అంటే భారత ఆటగాళ్లు అందరూ కూడా అత్యుత్తమ ప్రదర్శన చేయడమే లక్ష్యంగా బలిలోకి దిగుతూ ఉంటారు అని చెప్పాలి.  ఈ క్రమంలోనే ఇక ప్రత్యర్థి వికెట్ తీసినప్పుడు అగ్ర సీవ్ గా ఫీల్ అవుతు సంబరాలు చేసుకుంటూ ఉంటారు.

 ఇకపోతే ఇటీవల ఇక మొదటి టెస్ట్ మ్యాచ్ లో భాగంగా ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ సమయంలో భారత బౌలింగ్ విభాగం వరసగా వికెట్లు తీస్తుండగా.. అటు టీమ్ ఇండియా డ్రెస్సింగ్ రూమ్ లో ఇందిరా నగర్ గుండా హల్చల్ చేస్తూ సంబరాలు చేసుకున్నాడు. ఇంతకీ ఈ ఇందిరానగర్ గుండా ఎవరో తెలుసా టీమ్ ఇండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్. సాధారణంగా రాహుల్ ద్రావిడ్ ఎప్పుడు ఎంతో ప్రశాంతంగా కనిపిస్తాడు.  కొన్ని కొన్ని సార్లు మాత్రమే అగ్రేసివ్ గా రియాక్ట్ అవడం చూస్తూ ఉంటాం. ఇక ఇటీవల భారత బౌలర్లు వికెట్లు తీస్తుంటే రెడ్ బుల్ తాగిన కోహ్లీ మాదిరిగా ద్రవిడ్స్ సైతం పిడికిలి బిగించి సంబరాలు చేసుకున్నాడు. ఇక ఈ వీడియో ట్విట్టర్ లో వైరల్ గా మారిపోయింది. అయితే గతంలో క్రెడ్ యాప్ వాణిజ్య  ప్రకటనలో ఇందిరా నగర్ గుండా అనే పాత్రలో నటించాడు రాహుల్ ద్రావిడ్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: