కెప్టెన్సీకి.. రోహితే సరైనవాడు : రవిశాస్త్రి

praveen
అనూహ్యంగా  విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత ఇక విరాట్ కోహ్లీతో పాటే అటు జట్టులో సీనియర్గా కొనసాగుతున్న రోహిత్ శర్మ ఇక క్రమక్రమంగా మూడు ఫార్మాట్లకు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు అన్న విషయం తెలిసిందే. అయితే రోహిత్ శర్మ సారధిగా ఇప్పటికే సక్సెస్ అయ్యాడు.  ఐపీఎల్ లో ఎవరికి సాధ్యం కాని రీతిలో ఐదు సార్లు టైటిల్ గెలిచి ఇక విజయవంతమైన సారథిగా గుర్తింపు సంపాదించుకున్నాడు అని చెప్పాలి. ఇక కోహ్లీ లీవ్ లో ఉన్నప్పుడు కూడా టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టి తన కెప్టెన్సీ నైపుణ్యంతో అదరగొట్టాడు రోహిత్ శర్మ.

 ఇక టీమిండియా కు రెగ్యులర్ కెప్టెన్ గా సారధ్య బాధ్యతలు అందుకున్న తర్వాత వరుస విజయాలను అందిస్తూ దూసుకుపోతున్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ కెప్టెన్సీ వ్యూహాలపై ఎంతో మంది ప్రశంసలు కూడా కురిపించారు. ఇక ఇటీవలే రోహిత్ కెప్టెన్సీ గురించి టీమిండియా మాజీ కోచ్ రవి శాస్త్రి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు అని చెప్పాలి. ఇటీవల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా తో నాగపూర్ వేదిక జరిగిన తొలి టెస్ట్ లో టీమిండియా తొలి రోజే సంపూర్ణ ఆధిపత్యం చెలయించింది. బ్యాటింగ్లో బౌలింగ్లో కూడా సత్తా చాటింది.

 ఈ క్రమంలోనే రోహిత్ శర్మ కెప్టెన్సీ పై రవి శాస్త్రి ప్రశంసలు కురిపించాడు. కెప్టెన్ గా రోహిత్ శర్మ అదరగొట్టాడని తెలిపాడు. టీమిండియాకు ను నడిపించడానికి రోహిత్ శర్మనే సరైన వ్యక్తి. అతను ఒక అద్భుతమైన సారథి. మ్యాచ్ కు ముందు ఎంతో హోంవర్క్ చేసి బరిలోకి దిగుతాడు. ఇక అతని ఆలోచన విధానం కూడా అద్భుతంగా ఉంటుంది మొదటి టెస్టులో అతని బౌలింగ్ మార్పులు ఆశ్చర్యపరిచాయ్. వ్యూహలను రచించడంలో రోహిత్ ఎంతో స్మార్ట్. ఇక ప్రశాంతంగా ఒదిగి ఉండే వ్యక్తి అంటూ ప్రశంసలతో ఆకాశానికి ఎత్తేసాడు.

 పరిస్థితులకు తగ్గట్లుగానే ఇక ఎంతో వేగంగా తన వ్యూహాలను మార్చుకోవడంలో రోహిత్ సక్సెస్ అవుతూ ఉంటాడు. భారత జట్టుకు కెప్టెన్గా జట్టు కోసం ఏం చేయాలి అనే విషయంపై రోహిత్ కు ఫుల్ క్లారిటీ ఉంటుంది అంటూ రవి శాస్త్రి ప్రశంసలు కురిపించాడు. అచ్చంగా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తరహాలోనే ఓపెనర్ గా బరిలోకి దిగే రోహిత్ శర్మ.. ఇక ఏ బౌలర్ ని కూడా సెట్ కానివ్వకుండా తన బ్యాటింగ్ తో పరుగులు రాబడుతూనే ఉంటాడు అంటూ చెప్పుకొచ్చాడు. రోహిత్ ఒక గొప్ప సారథి అని.. ఇప్పటికే అతను ఈ విషయాన్ని నిరూపించుకున్నాడు అంటూ తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: