బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023 : స్పిన్ దెబ్బకు కుదేలైన ఆస్ట్రేలియా... ఇండియా బౌలర్లు అదుర్స్ !

VAMSI
ఈ రోజు నాగ్ పూర్ వేదికగా మొదలైన నాలుగు టెస్ట్ ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023 మొదటి టెస్ట్ ను ఇండియా అద్భుతంగా ఆరంభించింది. మొదట టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే అతని నిర్ణయం సరైనది కాదు అని తెలియడానికి ఎంతో సేపు పట్టలేదు. ఓపెనర్లుగా వచ్చిన డేవిడ్ వార్నర్ మరియు ఉస్మాన్ ఖవాజాలు చెరో పరుగు చేసి అవుట్ అయ్యారు. వీరిద్దరినీ సిరాజ్ మరియు షమీలు అవుట్ చేసి ఇండియాకు మంచి స్టార్ట్ ను అందించారు. ఇక అక్కడ నుండి ఫాస్ట్ బౌలర్లకు అవకాశం ఇవ్వకుండా స్పిన్నర్లు ఆస్ట్రేలియా ఆటగాళ్ల భరతం పట్టారు.
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ మొత్తానికి లాబుచెన్ 49 పరుగులు, స్టీవ్ స్మిత్ 37 పరుగులు, హాండ్స్ కాంబ్ 31 పరుగులు , క్యారీ 36 పరుగులు చేసి ఆస్ట్రేలియాను ఆదుకునే ప్రయత్నం చేసినప్పటికీ జడేజా మరియు అశ్విన్ ల స్పిన్ మాయాజాలానికి తలొగ్గక తప్పలేదు. వీరిద్దరూ 36 ఓవర్లు వేసి 89 పరుగులు ఇచ్చి 8 వికెట్లను పడగొట్టడం విశేషం. గతంలో గాయం కారణంగా దూరమైన జడేజా ఈ టెస్ట్ మ్యాచ్ ద్వారా ఇండియా అంతర్జాతీయ టీం లోకి అడుగు పెట్టాడు. రాగానే ఆస్ట్రేలియా లాంటి బలమైన టీం పై అయిదు వికెట్లు పడగొట్టాడు. ఇక అశ్విన్ అయితే మూడు వికెట్లను పడగొట్టి తనలో ఇంకా సత్తా ఉందని నిరూపించాడు. కానీ నిరాశ ఏమిటంటే మరో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ గా జట్టులో ఉన్న అక్షర్ పటేల్ 10 ఓవర్లు బౌలింగ్ చేసినా ఒక్క వికెట్ కూడా సాధించకపోవడం.
అలా ఆస్ట్రేలియా ఇండియా స్పిన్ దెబ్బకు కేవలం 177 పరుగులకే ఆల్ అవుట్ అయింది. ప్రస్తుతం ఇండియా బ్యాటింగ్ ప్రారంభించి ఒక్క వికెట్ ను కోల్పోయి 77 పరుగులు చేసింది. ఓపెనర్లుగా వచ్చిన రోహిత్ శర్మ మరియు కె ఎల్ రాహుల్ లు వికెట్ లేకుండా ఈరోజును ముగించడంలో ఫెయిల్ అయ్యారు. కె ఎల్ రాహుల్ (21) మర్ఫి బౌలింగ్ లో అతనికే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.  ఈ క్రమంలో కెప్టెన్ రోహిత్ శర్మ కేవలం బంతుల్లోనే 8 ఫోర్లు మరియు 1 సిక్సర్ తో అర్ద సెంచరీని పూర్తి చేయడం విశేషం.          

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: