ఒక్క దెబ్బకు రెండు పిట్టలు.. టీమిండియా ముందున్న టార్గెట్ అదే?

praveen
ఒక్క దెబ్బకు రెండు పిట్టలు.. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరగబోతున్న టెస్ట్ సిరీస్ కి ముందు టీమిండియా ముందు ఉన్న అతిపెద్ద సవాలు ఇదే . బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియాపై టెస్ట్ సిరీస్లో విజయం సాధిస్తే అటు టీమ్ ఇండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో అర్హత సాధిస్తుంది. అయితే ఇక ఇప్పటికే ఆస్ట్రేలియా జట్టు అగ్రస్థానంలో కొనసాగుతూ ఫైనల్లో అడుగుపెట్టింది అన్న విషయం తెలిసిందే.

 అదే సమయంలో ఇక సాంప్రదాయమైన క్రికెట్లో అగ్రస్థానం టీమిండియాను ఎంతగానో ఊరిస్తుంది.  ప్రస్తుతం పాయింట్లు పట్టికలో భారత్ జట్టు రెండవ స్థానంలో కొనసాగుతుంది అని చెప్పాలి.  ఇక ఆస్ట్రేలియాపై టెస్ట్ సిరీస్ లో విజయం సాధిస్తే టీమిండియా ఇక టెస్ట్ ఫార్మాట్లో అగ్రస్థానంలోకి వచ్చేస్తుంది. అయితే ఇప్పటికే వన్డే, టి20 ఫార్మట్ లో టీమ్ ఇండియా నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతుంది అని చెప్పాలి. ఇలాంటి మూడు ఫార్మాట్లలో కూడా ఒకేసారి అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్న జట్టుగా అటు భారత జట్టు అరుదైన రికార్డు సృష్టించేందుకు సిద్ధమవుతుంది అని చెప్పాలి.

 అయితే ఆస్ట్రేలియాతో జరగబోయే నాలుగు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ను 2-0 తేడాతో విజయం సాధించిన కూడా టెస్ట్ ర్యాంకింగ్స్ లో అగ్రస్థానాన్ని చేజిక్కించుకోవడం ఖాయంగానే కనిపిస్తుంది.  ఒకవేళ ఆస్ట్రేలియా జట్టు ఒక్క మ్యాచ్ గెలిచినా కూడా భారత్ కేవలం రెండవ స్థానానికి మాత్రమే పరిమితం కావలసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో 75.56 శాతం పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది ఆస్ట్రేలియా. 58.93%తో భారత్ రెండవ స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా 14 టెస్ట్ మ్యాచ్లు ఆడగా మరో ఐదు ఆడాల్సి ఉంది. దాదాపు ఆస్ట్రేలియా ఫైనల్ లో అడుగుపెట్టినట్లే. అయితే ఇప్పుడు వరకు భారత్ 14 టెస్టులు ఆడగా ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ ను 3-0 తేడాతో  గెలిస్తే.. ఏ సమీకరణాలు లేకుండా ఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.. ఇలా ఒక్క దెబ్బకు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ఛాన్స్.. మరోవైపు ఇక సాంప్రదాయమైన క్రికెట్లో అగ్రస్థానం కూడా టీమిండియా కు వశం అవుతుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: