అశ్విన్ క్వాలిటీ బౌలరే.. కానీ.. స్మిత్ షాకింగ్ కామెంట్స్?

praveen
క్రికెట్ ప్రేక్షకులందరూ ఎదురుచూస్తున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ రేపటి నుంచి జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్ కోసం ఇరు జట్ల ఆటగాళ్లు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు. అయితే ఈ ప్రతిష్టాత్మకమైన ట్రోఫీలో ఎవరి ప్రదర్శన ఎలా ఉంటుంది అనేదానిపై ప్రస్తుతం ఎన్నో ఊహాగానాలు తెరమీదకి వస్తూనే ఉన్నాయి. మాజీ ఆటగాళ్లు అందరూ కూడా ఇదే విషయంపై స్పందిస్తూ తమ అభిప్రాయాలను రివ్యూల రూపంలో చెప్పేస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే.

 ముఖ్యంగా గత కొంతకాలం నుంచి అయితే టీమిండియాలో సీనియర్ స్పిన్నర్గా కొనసాగుతున్న రవిచంద్రన్ అశ్విన్ గురించే చర్చ జరుగుతుంది. ఇప్పటివరకు రవిచంద్రన్ అశ్విన్ తన స్పిన్ బౌలింగ్ తో ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్లను ఇబ్బంది పెట్టడంలో సక్సెస్ అయ్యాడు అని చెప్పాలి. అంతే కాదు ఆస్ట్రేలియా తో జరిగిన టెస్ట్ మ్యాచ్ లలో ఇక అత్యధిక వికెట్లు తీసిన ప్లేయర్ ల లిస్టులో కూడా కొనసాగుతూ ఉన్నాడు రవిచంద్రన్ అశ్విన్. ఇక రేపటి నుంచి ప్రారంభం కాబోయే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కూడా రవిచంద్రన్ అశ్విన్ ఎంతో కీలకంగా మారబోతున్నాడు అన్నది మాత్రం తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఎంతోమంది మాజీ ఆటగాళ్లు అశ్విన్ ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్లను ఇబ్బంది పెట్టడం ఖాయమని అభిప్రాయపడుతున్నారు.

 ఇలాంటి సమయంలోనే ఆస్ట్రేలియా ఆటగాళ్లు మాత్రం మైండ్ గేమ్ ఆడుతూ సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు.  కంగారు బ్యాట్స్మెందరిని రవిచంద్రన్ అశ్విన్ ముప్పు తిప్పులు పెట్టడం ఖాయమని అందరూ అంటుంటే.. ఇక ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా ప్లేయర్స్ స్టీవ్ స్మిత్ మాత్రం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అశ్విన్ క్వాలిటీ బౌలర్. కానీ అతడిని ఎదుర్కోవడానికి మా దగ్గర కూడా చాలా ప్రణాళికలు ఉన్నాయి. ఇప్పటికే అతడి శైలిలో బౌలింగ్ చేసే మహేష్ తో ప్రాక్టీస్ చేశాము. ఇక అతడి గురించి మేము ఎక్కువగా ఆలోచించాలి అని అనుకోవట్లేదు అంటూ స్మిత్ చెప్పుకొచ్చాడు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: