పంత్ స్థానాన్ని.. భర్తీ చేసేది అతనొక్కడే : అశ్విన్

praveen
గత ఏడాది చివర్లో టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ ఘోర రోడ్డు ప్రమాదం బారిన పడ్డాడు అన్న విషయం తెలిసిందే. ఇక ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ క్రమంలోనే ఆసుపత్రిలో అతనికి సర్జరీలు కూడా జరుగుతూ ఉన్నాయి అని చెప్పాలి. అయితే అతను వేగంగా కోరుకుంటున్నాడని బీసీసీఐ అధికారులు చెబుతున్నారు. ఇక రిషబ్ పంత్ ఎంత వేగంగా కోలుకున్నప్పటికీ ఇక ఈ ఏడాది భారత జట్టు ఆడబోయే కీలకమైన సిరీస్ లకు మాత్రమే అందుబాటులో ఉండడం అనుమానంగానే కనిపిస్తుంది.

 ఈ క్రమంలోనే టీమిండియా కు ఎంతో ప్రతిష్టాత్మకమైన బోర్డర్ గవాస్కర ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా తో తలబడబోతుంది భారత జట్టు. అయితే ఇక సిరీస్ కు అటు రిషబ్ పంత్ లాంటి కీలక ఆటగాడు జట్టుకు అందుబాటులో లేకపోవడం టీమిండియా కు ఎదురు దెబ్బ అని చెప్పాలి. ఇక రిషబ్ పంత్ స్థానాన్ని  ఎవరు భర్తీ చేస్తారు అనే చర్చ కూడా జరిగింది అని చెప్పాలి. అయితే ఇక రిషబ్ పంత్ స్థానాన్ని భర్తీ చేసేది ఒకే ఒక్కడు అతను ఎవరో కాదు శ్రేయస్ అయ్యర్ అంటూ చెబుతున్నాడు టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్. గత ఏడాది బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో శ్రేయస్ అయ్యర్ మంచి ఫామ్ కనబరిచాడు. ఏకంగా 422 పరుగులు సాధించాడు.

 ఈ క్రమంలోనే అశ్విన్ మాట్లాడుతూ.. గత రెండేళ్ల నుంచి రిషబ్ పంత్ తో పాటు శ్రేయస్ అయ్యర్ కూడా టెస్ట్ జట్టులో కొనసాగుతున్నారు. ఇక అప్పుడు నుంచి అయ్యర్ జట్టులో కీలక ఆటగాడిగా మారిపోయాడు. అతను అద్భుతంగా రాణిస్తున్నాడు అని చెబితే అది అతనిపై పొగడ్తలు కురిపించడమే అవుతుంది. కానీ శ్రేయస్ అయ్యర్ భారత బ్యాటింగ్ ఆర్డర్ కి వెన్నుముక లాంటివాడు. పంతులేని లోటును అతను కచ్చితంగా తీరుస్తాడు అంటూ అశ్విన్ చెప్పుకొచ్చాడు. అయితే గత కొంతకాలం నుంచి వెన్ను నొప్పి గాయంతో బాధపడుతున్న అయ్యర్ తొలి టెస్ట్ కు అందుబాటులో ఉంటాడా లేదా అన్నది అనుమానంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: