ప్రపంచకప్ విజేతలకు.. బీసీసీఐ భారీ నజరానా?

praveen
గత కొంతకాలం నుంచి భారత క్రికెట్లో ప్లేయరలందరూ కూడా అదిరిపోయే ప్రదర్శనతో ఆకట్టుకుంటూ ఉన్నారు. అయితే ఇప్పుడు వరకు భారత పురుషులు అండర్ 19 జట్టు ఎన్నోసార్లు ప్రపంచ కప్ లో విజయం సాధించింది అన్న విషయం తెలిసిందే. అయితే పురుషుల క్రికెట్ అయితే ఇలా ఐసీసీ టోర్నీలో విజయం సాధించింది. కానీ అండర్ 19 మహిళల జట్టు మాత్రం ఇప్పటివరకు ఒక్కసారి కూడా అటు ప్రపంచ కప్ గెలవలేదు అని చెప్పాలి.

 ఈ క్రమం లోనే ఇక భారత మహిళల అండర్-19 జట్టు ఒక్కసారైనా ప్రపంచ కప్ గెలిస్తే బాగుంటుందని అభిమానులు అందరూ కూడా ఎంతో ఆశగా ఎదురు చూసారు. అయితే ఇక అభిమానులు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తూ ఇక ఈసారి విశ్వ విజేత గా నిలిచింది భారత జట్టు. ఇటీవల ఫైనల్ మ్యాచ్లో పటిష్టమైన ఇంగ్లాండును చిత్తుగా ఓడించి భారత అండర్ 19 మహిళల జట్టు టి20 వరల్డ్ కప్ ను దక్కించుకుంది అన్న విషయం తెలిసిందే. దీంతో ఇక భారత క్రికెట్ అభిమానులు అందరూ కూడా ఆనందంలో మునిగి పోయారు.

 అయితే ఇటీవల కాలం లో మహిళల క్రికెట్ ను ప్రోత్సహించడమే లక్ష్యం గా అటు బీసీసీఐ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ క్రమం లోనే ఇక ఇటీవలే భారత్కు టి20 ప్రపంచకప్ అందించిన అండర్ 19 మహిళల జట్టుకు సపోర్టింగ్ స్టాప్ కు కూడా బీసీసీఐ కార్యదర్శి ఒక గుడ్ న్యూస్ చెప్పారు. ఏకం గా ఐదు కోట్ల భారీ నజరానా ప్రకటించారు. ఫిబ్రవరి ఒకటవ తేదీన అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం లో జరిగే ఇండియా న్యూజిలాండ్ మ్యాచ్కు అండర్ 19 విన్నింగ్ జట్టును ఆహ్వానించి సత్కరించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక మీరందరూ కూడా మన గర్వపడేలా చేశారు అంటూ ప్రశంసలు కురిపించాడు జై షా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: