స్నేహితుల కోసం.. పాండ్య వారికి అన్యాయం చేస్తున్నాడా?

praveen
గత ఏడాది ఐపీఎల్ సీజన్లో కొత్తగా ఎంట్రీ ఇచ్చిన  గుజరాత్ టైటాన్స్  సారధ్య బాధ్యతలు చేపట్టి ఇక మొదటి ప్రయత్నంలోనే టైటిల్ అందుకున్నాడు కెప్టెన్ హార్దిక్ పాండ్యా. అయితే ఇక కెప్టెన్ హార్దిక్ పాండ్యా తన నాయకత్వ ప్రతిభను నిరూపించుకోవడంతో ఒక్కసారిగా భారత కెప్టెన్ రేస్ లో అందరినీ వెనక్కి నట్టేసాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే సీనియర్ ఆటగాళ్లు ఎంతోమంది ఉన్నప్పటికీ ఇక యువ ఆల్రౌండర్ హార్థిక్ పాండ్యాకే అటు టీమిండియా యాజమాన్యం గత కొన్ని రోజుల నుంచి టి20 కెప్టెన్సీ బాధ్యతలను అప్పగిస్తూ వస్తుంది అని చెప్పాలి.

 అయితే ఇక ఇలా భారత జట్టుకు కెప్టెన్సీ వహించే అవకాశం రాగా ఇక వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ అదరగొడుతూ ఉన్నాడు. తనదైన వ్యూహాలతో జట్టుకు విజయాలను అందిస్తూ ఇక ప్రత్యర్థి పై పూర్తి ఆధిపత్యం చెలాయించే విధంగా జట్టును ముందుకు నడిపిస్తున్నాడు. అయితే హార్దిక్ కెప్టెన్సీ చేపట్టిన తర్వాత మొదటిసారి ఇటీవలే రాంచి వేదికగా న్యూజిలాండ్తో జరిగిన టి20 మ్యాచ్ లో ఓడిపోయింది భారత జట్టు. 21 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది అని చెప్పాలి. అయితే ఈ మ్యాచ్ కోసం భారత్ ప్రకటించిన తుది జట్టుపై ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతుంది అని చెప్పాలి.

 అయితే హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన తర్వాత కేవలం తన స్నేహితులకు మాత్రమే చోటు కల్పిస్తున్నాడు అంటూ కొంతమంది కామెంట్ చేస్తున్నారు. స్నేహితులైన శుభమన్ గిల్, ఇషాన్ కిషన్  దీపక్ హుడా కుల్దీప్ లకు ప్రాధాన్యత ఇస్తున్నాడంటూ కామెంట్లు వినిపిస్తున్నాయ్. సుదీర్ఘకాలం తర్వాత జట్టులోకి వచ్చిన పృథ్వి షా కు మాత్రం హార్దిక్ అన్యాయం చేస్తున్నాడంటూ మరికొంతమంది మాట్లాడుకుంటున్నారు. అయితే టీమిండియా ఓడిపోయింది కాబట్టి ఇక ఇలాంటి చర్చ తెరమీదకి వచ్చింది. ఒకవేళ రెండవ మ్యాచ్లో విజయం సాధించింది అంటే ఇక ఇలాంటి చర్చకు తెరపడుతుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: