రోహిత్ కెప్టెన్సీకి.. గుడ్ బై చెప్పేది అప్పుడే : ఆకాష్ చోప్రా

praveen
గత కొన్ని రోజుల నుంచి రోహిత్ శర్మ తర్వాత ఇక భారత కెప్టెన్ ఎవరు అన్న చర్చ తీవ్రంగా జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. రోహిత్ కెప్టెన్గా ఒక్క మ్యాచ్లో విఫలమైన కూడా ఎప్పుడు ఈ చర్చ తెరమీదకి వస్తూ ఉంటుంది. అయితే రోహిత్ తర్వాత శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ లు ఎవరు ఒకరు కెప్టెన్సీ చేపట్టే అవకాశం ఉందని గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఇక గుజరాత్ టైటాన్స్ కెప్టెన్గా ఐపీఎల్ లో సక్సెస్ అయిన తర్వాత ఇక హార్దిక్ పాండ్యా అందరికంటే ముందు వరుసలోకి వచ్చేసాడు.

 ఈ క్రమంలోనే హార్దిక్ పాండ్యాకు ఇక టి20 కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుంది అని ఎంతో మంది మాజీ ఆటగాళ్లు కూడా డిమాండ్ చేయడం కూడా చూసాము. అయితే ఇక ఇప్పుడు మరి కొంతమంది యువ ఆటగాళ్లు పేరు కూడా కెప్టెన్సీ రేసులోకి వచ్చేసాయి అని చెప్పాలి. ఇక ఎప్పుడు ఇలాంటి విషయాల్లో రివ్యూలు ఇచ్చే టీమిండియా మాజీ ఆటగాడు ఆకాష్ చోప్రా ఇక ఇప్పుడు టీమిండియాకు రోహిత్ తర్వాత కెప్టెన్ ఎవరు అనే విషయంపై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భవిష్యత్తు క్రికెట్లో టెస్ట్ ఫార్మాట్ కెప్టెన్సీకి శుభమన్ గిల్, రిషబ్ పంత్ లే అర్హులు అంటూ ఆకాష్ చోప్రా అభిప్రాయపడ్డాడు.

 అంతేకాదు ఈ ఏడాది జూన్లో జరిగే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ వరకు మాత్రమే రోహిత్ టెస్ట్ కెప్టెన్ గా ఉండే అవకాశం ఉంది అంటూ అంచనా వేశాడు. ఇక ధోని లాగానే రోహిత్ సైతం కెప్టెన్సీ బాధ్యతలను యువ ఆటగాళ్లకు అప్పగించాలని ఎంతోమంది మాజీలు సూచించారు. ఈ క్రమంలోనే ఆకాశ చోప్రా మాట్లాడుతూ. ఒక వ్యక్తి అన్ని ఫార్మాట్లకు కెప్టెన్ గా ఉండడం ఇక ముందు జరగదు. ఆ రోజులు ఎప్పుడో పోయాయి. టెస్ట్ జట్టు కెప్టెన్ గా రోహిత్ కేవలం ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ వరకు మాత్రమే కొనసాగే అవకాశం ఉంది. పొట్టి ఫార్మాట్కు ప్రస్తుతం హార్దిక్ పాండ్యా సారధ్యం వహిస్తున్నాడు. ఇక వచ్చే ఏడాది వరల్డ్ కప్ కి కూడా కెప్టెన్ గా హార్దిక్ ఉంటాడని ఆశిస్తున్నాను. ఇక రోహిత్ కేవలం వన్డేలకు మాత్రమే కెప్టెన్ గా ఉంటు వన్డే వరల్డ్ కప్ వరకు కొనసాగే అవకాశం ఉంది అంటూ ఆకాష్ చోప్రా షాకింగ్ కామెంట్స్ చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: