ఐపీఎల్ ఆల్ టైం జట్టులో.. ఏబీడీకి చోటివ్వని లెజెండ్?

praveen
సౌత్ ఆఫ్రికా క్రికెట్లో విధ్వంసకర బ్యాట్స్మెన్ గా పేరు సంపాదించుకున్న మిస్టర్ 360 ప్లేయర్ ఏబి డివిలియర్స్ గురించి ప్రత్యేకంగా క్రికెట్ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు అని చెప్పాలి. కేవలం ప్రపంచ క్రికెట్లో మాత్రమే కాదు బిసిసిఐ నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ కారణంగా కూడా అటు భారత క్రికెట్ ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరయ్యాడు అని చెప్పాలి.
 ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో అత్యధిక స్కోరు చేసిన ఆటగాళ్ల లిస్టులో ఆరవ స్థానంలో కొనసాగుతూ ఉన్నారు ఎబి డివిలియర్స్. ఇలా తన విధ్వంసకరమైన ఆట తీరుతో ప్రతి చోట కూడా ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు అని చెప్పాలి. అయితే విధ్వంసకర ఆటగాడికి ఇటీవల లెజెండ్స్ ప్రకటించిన జట్టులో మాత్రం చోటు లేకపోవడం గమనార్హం. ఇక ఐపీఎల్ 2023 నేపథ్యంలో  జియో సినిమా షో లెజెండ్స్ లాంచ్ లో క్రిస్ గేల్, సురేష్ రైనా, పార్థివ్ పటేల్, రాబిన్ ఉత్తప్ప, స్కాట్ స్టైరిష్ వంటి మాజీ క్రికెటర్లతో కలిసి పాల్గొన్నాడు అనిల్ కుంబ్లే.

 ఈ క్రమంలోనే తమ ఆల్ టైం ఐపీఎల్ ప్లేయింగ్ 11 జట్టును చెప్పాలంటూ ప్రశ్న వేయగా.. అనిల్ కుంబ్లే స్పందిస్తూ తన జట్టులో ఎబి డివిలియర్స్ కష్టం అంటూ చెప్పుకొచ్చాడు. నా జట్టుకు మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్. ఈ వికెట్ కీపర్ ఐదవ స్థానంలో బ్యాటింగ్ కి వస్తాడు. ఇక డెవిలియర్స్ కోసం ఏకంగా ధోనిని పక్కన పెట్టలేను. ఆరో స్థానంలో కిరణ్ పొలార్డ్ ఆడిస్తా అంటూ అనిల్ కుంబ్లే చెప్పుకొచ్చాడు. నాలుగుసార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన కెప్టెన్గా కొనసాగుతున్న మహేంద్ర సింగ్ ధోనికే తన ఓటు అంటూ తెలిపాడు. అయితే ఈ విషయం తెలిసిన మిస్టర్ 360 ప్లేయర్ అభిమానులు ఏకంగా అలాంటి ఆటగాడికే అనిల్ కుంబ్లే చోటు ఇవ్వకపోవడం ఏంటి అంటూ ఆశ్చర్యపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: