ఏమో అనుకున్నాం కానీ.. రషీద్ ఖాన్ తోపే?

praveen
రషీద్‌ ఖాన్... ఇప్పుడు క్రికెట్ సర్కిల్ లో ఎక్కడ విన్నా ఈ పేరే వినబడుతోంది. దానికి కారణం T20. అవును
T20 క్రికెట్‌లో ఆఫ్ఝ‌నిస్తాన్ స్పిన్న‌ర్‌ ఐనటువంటి ర‌షీద్‌ ఖాన్ తాజాగా అరుదైన రికార్డును నెల‌కొల్పాడు. పొట్టి ఫార్మెట్‌లో 500 వికెట్లు తీసి ఔరా అనిపించాడు. దాంతో t20 ఫార్మెట్‌లో 500 వికెట్లు తీసిన‌ 2వ బౌల‌ర్‌గా అవతరించాడు. ఈ ఘ‌న‌త‌ను సొంతం చేసుకున్న తొలి ఆసియా బౌల‌ర్‌గా ర‌షీద్‌ ఖాన్ రికార్డ్ క్రియేట్ చేయడం ఇక్కడ విశేషంగా చెప్పుకోవచ్చు. అవును, ప్ర‌పంచ t20 క్రికెట్‌లో 500 వికెట్లు తీసుకున్న రెండో బౌల‌ర్‌గా ర‌షీద్‌ఖాన్ నిలిచాడు.
ఇకపోతే ఈ జాబితాలో ఈపాటికే 614 వికెట్లు పడగొట్టిన వెస్టిండీస్ ఆల్‌రౌండ‌ర్ అయినటువంటి 'డ్వాన్ బ్రావో' ఫ‌స్ట్ ప్లేస్‌లో కొనసాగుతున్నాడు. అయితే t20 క్రికెట్‌లో 500 వికెట్ల‌ను అత్యంత వేగంగా తీసిన బౌల‌ర్ ర‌షీద్‌ ఖాన్ కావ‌డం గ‌మ‌నార్హం. త్వరలో డ్వాన్ బ్రావో రికార్డుని కూడా పడగొట్టి ముందుకు దూసుకుపోతాడని కొంతమంది క్రికెట్ పండితులు గుసగుసలాడుకుంటున్నారు. ఇక కేవలం 368 ఇన్నింగ్స్‌ల‌లోనే ర‌షీద్‌ ఖాన్ ఈ 500 వికెట్ల మైలురాయిని చేరుకోవడం పట్ల అతని అభిమానులు అయితే సంబరాలు చేసుకుంటున్నారు.
ఇకపోతే ప్రస్తుతం అత్య‌ధిక వికెట్ల జాబితాలో 474 వికెట్ల‌తో థ‌ర్డ్ ప్లేస్‌లో సునీల్ న‌రైన్ కొనసాగుతుండగా, 466 వికెట్ల‌తో ఇమ్రాన్ తాహిర్ 4వ స్థానం లో ఉండటం కొసమెరుపు. ప్ర‌స్తుతం సౌతాఫ్రికా t20 లీగ్‌లో MI కేప్‌టౌన్ టీమ్‌కు ర‌షీద్‌ ఖాన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న సంగతి అందరికీ తెలిసినదే. సోమ‌వారం ప్రిటోరియా కాపిట‌ల్స్‌తో జ‌రిగిన మ్యాచ్ ద్వారా T20లో 500 వికెట్ల ఘ‌న‌త‌ను ర‌షీద్‌ ఖాన్ అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 4 ఓవ‌ర్లు వేసి 16 ప‌రుగులు ఇచ్చిన ర‌షీద్‌ ఖాన్ 3 వికెట్లు పడగొట్టాడు. దాంతో ఈ మైలురాయిని చేరుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: