కోహ్లీ అరుదైన ఘనత.. ప్రపంచ క్రికెట్లో ఒకే ఒక్కడు?

praveen
ప్రపంచ క్రికెట్లో విరాట్ కోహ్లీకి ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టీమిండియాలోకి అరంగేట్రం చేసిన తక్కువ సమయంలోనే తాను అందరిలాంటి ఆటగాడిని కాదని చరిత్రలో నిలిచిపోయే ఆటగాడిని అన్న విషయాన్ని తన ఆట తీరుతోనే నిరూపించాడు.  ఏకంగా అరంగేట్రం నుంచే ప్రపంచ రికార్డుల వేట ప్రారంభించి ప్రస్తుతం కింగ్ కోహ్లీగా మారిపోయాడు అని చెప్పాలి. ఇక అతనికి అన్ని ఫార్మాట్లలో తిరుగులేదు అనే విధంగానే హవా నడిపించాడు.

 ఒకానొక సమయంలో ఇక క్రికెట్లో ఉన్న మూడు ఫార్మాట్లలో కూడా నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్న ఏకైక ప్లేయర్ గా కూడా అటు విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు అని చెప్పాలి. అయితే దాదాపు గత మూడు ఏళ్ల పాటు ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడిన విరాట్ కోహ్లీ ఆ తర్వాత మునుపటి అందుకని మళ్లీ తిరుగులేదు అనే విధంగానే చెలరేగిపోతున్నాడు. వరుసగా సెంచరీలతో అభిమానులు అందరిని కూడా ఉర్రూతలూగిస్తూ టీమ్ ఇండియా విజయాల్లో కీలకపాత్ర వహిస్తూ ఉన్నాడు అని చెప్పాలి.

 ఇకపోతే ఇలా గత కొన్ని రోజుల నుంచి అత్యుత్తమమైన ఫామ్ కనబరుస్తున్న విరాట్ కోహ్లీ కి ఇటీవల ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఒక అరుదైన గౌరవాన్ని ఇచ్చింది. ఏకంగా ఐసిసి ప్రకటించిన అత్యుత్తమ జట్లలో అటు మూడు ఫార్మాట్లలో కూడా విరాట్ కోహ్లీ చోటు దక్కించుకున్నాడు అని చెప్పాలి. ఇప్పటివరకు ఏ క్రికెటర్ కూడా ఐసీసీ ప్రకటించిన బెస్ట్ టీమ్లలో మూడు ఫార్మాట్ లలో చోటు సంపాదించుకోలేకపోయాడు. కానీ కోహ్లీ మాత్రం మూడుసార్లు ఐసిసి టెస్ట్ జట్టులో.. ఆరుసార్లు వన్డే జట్టులో చోటు సంపాదించుకున్నాడు. ఇక ఇటీవల ఐసీసీ విడుదల చేసిన టి20 జట్టులో కూడా అత్యుత్తమ టీంలో ఉన్నాడు కోహ్లీ. ఇలా మూడు ఫార్మాట్లలో ఐసిసి ప్రకటించిన అత్యుత్తమ టీమ్లలో చోటు సంపాదించుకున్న ఏకైక పేరుగా నిలిచాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: