తన బయోపిక్ నుండి తప్పుకున్న.. మాజీ క్రికెటర్?

praveen
ఇటీవల కాలంలో ఎంతోమంది క్రీడాకారులు రాజకీయ నాయకులకు సంబంధించిన జీవిత కథ ఆధారంగా బయోపిక్లను తెరకెక్కించడానికి ఎంతోమంది దర్శక నిర్మాతలు ఆసక్తి చూపుతూ ఉన్నారు అని చెప్పాలి. అదే సమయంలో ఇక అప్పటికే క్రికెట్లో లెజెండ్స్ గా గుర్తింపు సంపాదించుకున్న ఆటగాళ్లు కూడా తమ బయోపిక్ లలు తెరకెక్కుతూ  ఉంటే అందులో వారే స్వయంగా భాగస్వామ్యం అవుతూ ఉండడం కూడా ఇటీవల కాలంలో చూస్తూ ఉన్నాం. అయితే కేవలం భారత్లో మాత్రమే కాదు పాకిస్తాన్లో కూడా ఇలా క్రికెటర్లను అమితంగా ఆరాధిస్తూ ఉంటారు ప్రేక్షకులు. ఈ క్రమంలోనే వారికి సంబంధించిన బయోపిక్ తెరకెక్కుతుంది అంటే చాలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు.

 ఈ క్రమంలోనే ఇప్పటివరకు పలువురు క్రికెటర్ల బయోపిక్ లు కూడా తెరకెక్కయి అని చెప్పాలి. అయితే ఇక పాకిస్తాన్ క్రికెట్లో తన స్పీడ్ బౌలింగ్ తో రావాల్పిండి ఎక్స్ప్రెస్ అనే ఒక అరుదైన బిరుదును సొంతం చేసుకున్న షోయబ్ అక్తర్ జీవిత కథ ఆధారంగా ప్రస్తుతం అతని బయోపిక్ తెరకెక్కుతూ ఉండడం గమనార్హం. అయితే ఈ బయోపిక్ లో స్వయంగా షోయబ్ అక్తర్ భాగం అయ్యాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఈ బయోపిక్ ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందా అని అటు అభిమానులు అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు.

 ఇలాంటి సమయంలో మాజీ ఆటగాడు షోయబ్ అక్తర్ అభిమానులందరికీ కూడా ఊహించని షాక్ ఇచ్చాడు అని చెప్పాలి. రావల్ పిండి ఎక్స్ ప్రెస్  పేరుతో తెరకెక్కుతున్న  తన బయోపిక్ మూవీ ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నాను అంటూ ఇటీవల సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. కొన్ని నెలలుగా మేకర్స్ తో విభేదాలు వచ్చాయి అంటూ తెలిపాడు. ఈ ప్రాజెక్టులో కొనసాగాలని చాలా ప్రయత్నించినప్పటికీ కుదరలేదు. ఇక బయోపిక్ నుంచి తప్పుకున్నందుకు ఎంతో బాధగా ఉంది. నా అనుమతి లేకుండా బయోపిక్ తెరకెక్కిస్తే.. న్యాయపరమైన చర్యలు తీసుకుంటాము అంటూ షోయబ్ అక్తర్ హెచ్చరించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: