కేఎల్ రాహుల్ వస్తే.. జట్టులో ఆ ఇద్దరికీ చోటు కష్టమే?

praveen
గతకొంతకాలం నుంచి భారత జట్టులో యువ ఆటగాళ్లదే హవా ఎక్కువైంది అన్న విషయం తెలిసిందే. ఇక భారత జట్టులో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడమే లక్ష్యంగా ప్రతి ఆటగాడు అద్భుతమైన ప్రదర్శన చేస్తున్నాడు. గతంలో రోహిత్ శర్మ అందుబాటులో లేని సమయంలో జట్టులో స్థానం దక్కించుకున్న ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ చేసి అదరగొట్టాడు. ఇక ఆ తర్వాత ఇటీవలే కేఎల్ రాహుల్ లేకపోవడంతో ఇక అటు రోహిత్ కి ఓపెనర్ జోడిగా బరిలోకి దిగిన శుభమన్ గిల్ న్యూజిలాండ్తో జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో డబుల్ సెంచరీ  చేసి ఎన్నో ప్రపంచ రికార్డులను కొల్లగొట్టాడు అని చెప్పాలి.

 పెళ్లి నేపథ్యంలో ఇక కేఎల్ రాహుల్ బీసీసీఐ అనుమతితో సెలవుల్లో ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే కేఎల్ రాహుల్ ప్రస్తుతం జట్టుకు అందుబాటులో లేని నేపథ్యంలో ఇక డబుల్ సెంచరీ వీరులు ఇషాన్ కిషన్, శుభమన్ గిల్ ఇద్దరు కూడా అటు భారత జట్టులో కనిపిస్తున్నారు. అయితే కేఎల్ రాహుల్ ఒకవేళ జట్టులోకి వస్తే మాత్రం ఇక ఇద్దరిలో ఎవరో ఒకరిని మాత్రమే తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది అన్నది తెలుస్తుంది. ఇక ఇదే విషయంపై ఎంతో మంది మాజీ ఆటగాళ్ళు కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు అని చెప్పాలి.

 భారత మాజీ బ్యాట్స్మెన్ సంజయ్ మంజ్రేకర్ కూడా ఇలాంటి వ్యాఖ్యలతో ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయాడు. ఒకవేళ రాహుల్ తిరిగి జట్టులోకి ఎంట్రీ ఇస్తే శుభమన్ గిల్ ఇషాన్ కిషన్ ఇద్దరిని జట్టులో కొనసాగించడం కష్టమని అభిప్రాయం వ్యక్తం చేశాడు సంజయ్ మంజ్రేకర్. ఒకవేళ రాహుల్ వస్తే ఇషాన్ కిషన్ జట్టు నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. ఇషాన్ కిషన్ మిడిల్ ఆర్డర్లో స్థిరపడలేదని అర్థమవుతుంది. అందుకే కేఎల్ రాహుల్ వచ్చి మిడిల్ ఆర్డర్లో ఆడాలంటే ఇక జట్టు నుంచి పక్కకు పెట్టాలి. ఇక ప్రస్తుతం భారత జట్టుకు ఎంతో మంది క్రికెటర్లు అందుబాటులో ఉన్నారు అంటూ సంజయ్ మంజ్రేకర్ వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: