రాకెట్ సైన్స్ అవసరం లేదు.. అలా చేస్తే వరల్డ్ కప్ గెలవచ్చు?

praveen
2011లో మహేంద్రసింగ్ ధోని కెప్టెన్సీలో వన్డే వరల్డ్ కప్ను ముద్దాడింది టీం ఇండియా జట్టు. కానీ ఇప్పటివరకు ఇక వరల్డ్ కప్ ని గెలవలేకపోయింది అని చెప్పాలి. ప్రతిసారి  వన్డే  వరల్డ్ కప్ లో భారీ అంచనాల మధ్య బరిలోకి దిగడం.. తర్వాత పేలవ ప్రదర్శనతో నిరాశ పడటం టీం  ఇండియా వంతు అవుతుంది. దీంతో టీమిండియా  ప్రదర్శన పై అటు తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా వస్తున్నాయి అని చెప్పాలి. ఇదిలా ఉంటే ఇక  ఈ ఏడాది మరింత భారీ అంచనాలతో భారత జట్టు బరిలోకి దిగబోతుంది.
 దీనికి కారణం ఇక ఏడాది వన్డే వరల్డ్ కప్ అటు భారత్ వేదికగా జరుగుతూ ఉండడమే. అయితే సొంత గడ్డపై భారత జట్టును ఓడించడం అంత తేలికైన విషయం కాదు అన్న విషయం అటు ప్రత్యర్థి జట్లకు కూడా తెలుసు. అయితే టీమిండియా ముందు ప్రస్తుతం ఉన్న ప్రధాన సమస్య ఏదైనా ఉంది అంటే సరైన ఆటగాళ్ళను జట్టులోకి తీసుకోవడమే. ఇక గత కొంతకాలం నుంచి ఇదే విషయంపై ఎంతో మంది మాజీ ఆటగాళ్లు స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. టీమ్ ఇండియాలో సీనియర్స్ స్పిన్నర్ గా కొనసాగుతున్న రవిచంద్రన్ అశ్విన్ సైతం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

 స్వదేశంలో మైదానాలు వన్డే ప్రపంచ కప్ నెగ్గేందుకు భారత్కు అవకాశాలు ఉంటాయా అంటూ అడిగిన ప్రశ్నకు ఆసక్తికర సమాధానం చెప్పాలి. 2011 వరల్డ్ కప్ నుంచి ఉదాహరణగా తీసుకుంటే.. స్వదేశంలో ఆడిన జట్టు కప్పు నిలబెట్టుకుంటూ వస్తుంది. 2011లో భారత్ 2017 లో ఆస్ట్రేలియా 2019లో ఇంగ్లాండ్ జట్టు టైటిల్స్ సొంతం చేసుకున్నాయి అన్న విషయం అందరికీ తెలుసు.  కాబట్టి ఇక్కడ ఏమీ రాకెట్ సైన్స్ సూత్రాలు లేవు. పరిస్థితులను అర్థం చేసుకొని ఆడితే సరిపోతుంది. ఏది ఏమైనా ఇక ఇప్పటివరకు టీమిండియా భారత్లోని అన్ని వేదికలపై మంచి పట్టు సాధించింది అంటూ రవిచంద్రన్ అశ్విన్ వ్యాఖ్యానించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: