నేడే రెండో వన్డే మ్యాచ్.. చూసేందుకు సిద్ధమైన ఫ్యాన్స్?

praveen
2023 ఏడాదిని ఎంతో ఘనంగా ప్రారంభించింది టీమ్ ఇండియా జట్టు . ఈ క్రమంలోనే భారత పర్యటనకు వచ్చిన శ్రీలంక  పై పూర్తి ఆదిపత్యాన్ని చలాయించింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే టి20 సిరీస్ తో పాటు వన్డే సిరీస్ కూడా గెలుచుకుంది. ఇక ఇదే జోరులో ఇక ఇండియా పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్తో వన్డే సిరీస్ ప్రారంభించింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇటీవల హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో టీమిండియా ప్రదర్శన అదిరిపోయింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

 ఇక మొదటి వన్డే మ్యాచ్ లో 12 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. తద్వారా ఇక మూడు మ్యాచ్ల వండే సిరీస్ లో భాగంగా ఇక 1-0 తేడాతో ఆదిఖ్యాన్ని సాధించింది అని చెప్పాలి.  ఇక ఇప్పుడు నేడు న్యూజిలాండ్ తో రెండో వన్డే మ్యాచ్లో తలబడేందుకు సిద్ధమైంది టీమ్ ఇండియా జట్టు. అయితే ఇక ఈ మ్యాచ్ లో విజయం సాధించి సిరీస్ ను దక్కించుకోవాలని టీమ్ ఇండియా భావిస్తుంది అని చెప్పాలి. దీనికోసం ఇక న్యూజిలాండ్ ను ఓడించడమే లక్ష్యంగా పక్కా వ్యూహాలతో బరిలోకి దిగేందుకు సిద్ధమైంది. అదే సమయంలో ఇక మొదటి వన్డే మ్యాచ్లో గట్టి పోటీ ఇచ్చిన న్యూజిలాండ్ ఇక ఇప్పుడు రెండో వన్డే మ్యాచ్లో తప్పక విషయం సాధించాలని పట్టుదలతో ఉంది.

 సిరీస్ అవకాశాలు సజీవంగా ఉండాలి అంటే అటు న్యూజిలాండ్ జట్టు తప్పనిసరిగా రెండవ వన్డే మ్యాచ్లో విజయం సాధించాల్సి ఉంది. తద్వారా ఇక ఎలాంటి తప్పులు చేయకుండా రెండో వన్డే మ్యాచ్లో మెరుగైన ప్రదర్శన చేసి విజయం సాధించాలని లక్ష్యంతో బలిలోకి దిగబోతుంది కివీస్. అయితే మొదటి వన్డే మ్యాచ్ లో గట్టి పోటీ ఇచ్చిన కివీస్ ను రెండో వన్డే మ్యాచ్లో తక్కువ అంచనా వేయడానికి లేదు అని చెప్పాలి. ఇక మొదటి వన్డే మ్యాచ్లో అటు బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ విభాగం కూడా ఆకట్టుకునే ప్రదర్శన చేయలేదు భారత జట్టు. కాగా ఇక రెండో వన్డే మ్యాచ్ రాయపూర్ వేదికగా మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు ప్రారంభం కాబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: