ఏంటి.. న్యూజిలాండ్తో మూడో వన్డే రద్దు అవుతుందా?

praveen
2023 ఏడాదిలో భారత పర్యటనకు వస్తున్న విదేశీ జట్లతో వరుసగా సిరీస్ లు ఆడుతూ బిజీబిజీగా గడుపుతుంది టీమిండియా. ఈ క్రమంలోనే అటు మొన్నటికి మొన్న శ్రీలంకతో రెండు సిరీస్ లను ముగించుకున్న టీమిండియా ఇక ఇప్పుడు భారత పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్తో వన్డే సిరీస్ ఆడుతుంది. ఈ క్రమంలోనే ఇటీవల హైదరాబాద్ లోనే ఉప్పల్ స్టేడియం వేదికగా మొదటి వన్డే మ్యాచ్ జరిగింది. హోరా హోరీగా జరిగిన ఈ మ్యాచ్ లో 12 పరుగులు తేడాతో టీమ్ ఇండియా విజయం సాధించింది. ఈ క్రమంలోనే  రెండో వన్డే మ్యాచ్ లో కూడా విజయం సాధించి సిరీస్ గెలుచుకోవడం లక్ష్యంగా ముందుకు సాగుతుంది అన్న విషయం తెలిసిందే.

 ఇకపోతే ఇక ఈ సిరీస్ లోని మూడవ వన్డే మ్యాచ్ కూడా భారత్లోని మూడు వేదికలపై జరుగుతూ ఉండడం గమనార్హం. అయితే మూడో వన్డే మ్యాచ్ ఇండోర్ లోని హోల్ కర్ స్టేడియంలో జరగనుంది. అయితే ఈ మ్యాచ్ జరుగుతుందా లేక రద్దు అవుతుందా అన్నది మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. మూడో వన్డే మ్యాచ్ టికెట్ల విక్రయంపై  పెద్ద దుమారం చెలరేగింది. ఈ వ్యవహారం ఏకంగా హైకోర్టు వరకు వెళ్ళింది. ఈ మ్యాచ్ కు సంబంధించి టికెట్లు విడుదల చేయగా ఒక్క నిమిషంలో మూడు వేలకు పైగా టికెట్లు ఎలా అమ్ముడయ్యాయని రాకేష్ సింగ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. బ్లాక్ మార్కెటింగ్ ప్రకారం టికెట్లు అమ్మకాలు జరిపాలంటూ ఆరోపణ చేశాడు.

 ఐదు నిమిషాల్లో అన్ని టికెట్లు బుక్ కావడంపై ప్రశ్నలు కూడా తలెత్తాయి అని చెప్పాలి. కాగా మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ దీనిపై తమ వైఖరిని వెల్లడించింది. అయితే హైకోర్టు మాత్రం తన నిర్ణయాన్ని రిజర్వులో పెట్టింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక ఇందుకు సంబంధించిన వాదనలు అటు హైకోర్టులో కొనసాగుతూనే ఉండడం గమనార్హం. ఒకవేళ హైకోర్టు ఇక ఈ నిర్ణయాన్ని రిజర్వులో పెడితే మాత్రం ఇక ఇండోర్లో జరగబోయే మూడో వన్డే మ్యాచ్ జరుగుతుందా లేకపోతే రద్దు అవుతుందా అన్నది మాత్రం హాట్ టాపిక్ గా మారింది. ఏం జరుగుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: